ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలి

Nov 24 2026 12:18 AM | Updated on Nov 24 2026 12:18 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్‌ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ సోమవారం రాష్ట్రంలోని జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పురోగతి, తదితర అంశాలపై సమీక్షించారు. దీనికి రాజమహేంద్రవరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌ కీర్తి చేకూరి, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎంఆర్‌ఆర్‌ ప్రేమ్‌కుమార్‌, జిల్లా పాఠశాల విద్యా అధికారి కె.వాసుదేవరావు, కోఆర్డినేషన్‌ సూపరింటెండెంట్‌ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,81,011 మంది ఎఎస్‌డీ ఓటర్లుగా గుర్తించినట్లు వివరించారు. ఇందులో మరణించిన వారు 75,910 మంది, ఆచూకీ లభించని వారు, గైర్హాజరైన వారు 26,924 మంది, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారు 49,679 మంది, ఇతర కారణాలతో గుర్తించిన వారు 69 మంది ఉన్నారన్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటరుగా నమోదైన వారు 28,429 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఈ జాబితాలోని ప్రతి వివరాన్ని క్షేత్రస్థాయిలో నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపునకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. తుది ఓటరు జాబితా ప్రచురణను వచ్చే నెల 22 నాటికి ప్రకటించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement