రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిపోయిందని, దీనిని ఓటుతో తరిమికొడదామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంగా ఉండేవారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ధరల మోత, అవినీతి తప్ప ఇంకేమీ లేదని దుయ్యబట్టారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా 29వ డివిజన్ అభ్యర్థి బొబ్బిలి కృష్ణప్రసాద్ (కేపీ నాయుడు)ను గెలిపించాలని కోరుతూ చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు వాస్తవాలను గమనించి, విజ్ఞతతో ఆలోచించి మేయర్ అభ్యర్థి దాసి వెంకటరావు, కార్పొరేటర్ అభ్యర్థి నాయుడును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు.
ఫ చంద్రబాబు పాలనను తరిమేద్దాం
ఫ ఎన్నికల ప్రచారంలో
చెల్లుబోయిన, జక్కంపూడి రాజా


