రాజమహేంద్రవరం సిటీ: దగాకోరు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం టీటీడీ కల్యాణ మండపం రోడ్డులో పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులతో కలసి పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుడు, వివాద రహితుడు, సౌమ్యుడైన దాసి వెంకటరావును నగర మేయర్ అభ్యర్థిగా జగనన్న ప్రకటించారన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ అధైర్య పడాల్సిన పనిలేదన్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ నగర పాలక సంస్థల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో వార్ వన్ సైడ్ అయిపోయిందన్నారు. వైఎస్సార్ సీపీ విజయం ఖాయమన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నిస్సిగ్గుగా కొనుగోలు చేసేందుకు కూటమి ప్రయత్నాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్‌గా దాసి వెంకటరావు గెలిచి కార్పొరేషన్‌పై వైఎస్సార్ సీపీ జెండాను ఎగుర వేయబోతున్నామన్నారు. మేయర్‌గా విజయం సాధించిన వెంటనే 100 రోజుల ప్రణాళికతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మేయర్ అభ్యర్థి దాసి వెంకటరావు మాట్లాడుతూ ఆర్మీలో సైనికునిగా నీతి నిజాయితీతో దేశానికి సేవలు అందించానన్నారు. తనను గెలిపిస్తే నగరాభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. హితకారిణి సమాజం చైర్మన్‌గా అన్నివిధాలా అభివృద్ధికి కృషి చేశానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి చందన నాగేశ్వర్, రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్ కానుబోయిన సాగర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, నగర మహిళా అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు.
ఫ రాజమహేంద్రవరంలో వైఎస్సార్ సీపీదే హవా
ఫ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు


