అడుగడుక్కీ బంధనాలేంటి స్వామీ! | - | Sakshi
Sakshi News home page

అడుగడుక్కీ బంధనాలేంటి స్వామీ!

Nov 23 2026 5:24 AM | Updated on Nov 23 2026 5:24 AM

● రత్నగిరి ప్రాంగణమంతా గేట్లు, తాళాలు

● అవస్థలు పడుతున్న భక్తులు

● నిర్వహణ ఇలాగేనా అని ప్రశ్నిస్తున్న భక్తులు

అన్నవరం: కార్తికమాసంలో రత్నగిరికి వచ్చే భక్తుల తాకిడిని తట్టుకునేందుకు ఆలయ వర్గాలు ఎక్కడికక్కడ తాళాలు వేయడంతో చాలా మంది అవస్థలు పడుతున్నారు. తూర్పురాజగోపురం ఎదుట ఉన్న మెట్ల దారి నుంచి భక్తుల సంచారాన్ని నియంత్రించేందుకు అక్కడి గేట్లకు తాళాలు వేసి యాగశాల పక్కన నిర్మించిన మెట్ల ద్వారా దిగువకు వెళ్లే ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశంలోనే భక్తుల సెల్‌ఫోన్లు భద్రపరచే కౌంటర్‌ ఉండడంతో అధిక సంఖ్యలో భక్తులు గుమిగూడడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. అలా కాకుండా రాజగోపురం వద్ద సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేసి క్రమ పద్ధతిలో భక్తులను పంపడం ద్వారా సమస్య పరిష్కరించవచ్చు. అలాగే సెల్‌ఫోన్‌ కౌంటర్‌ను రామాలయం సమీపంలో ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది.

అలాగే సన్‌ డయల్‌ దిగువన ఉన్న మరుగుదొడ్ల వద్ద సైతం గేట్లకు తాళాలు వేయడంతో సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ సైతం సెక్యూరిటీని పెట్టడం ద్వారా సాధారణ భక్తుల మరుగు అవసరాలను తీర్చవచ్చు. అలాగే తూర్పు రాజగోపురం వద్ద ఆలయ ప్రాంగణానికి ఇరువైపులా గేట్లు పెట్టి భక్తులను నియంత్రించే బదులు సెక్యూరిటీ గార్డును పెట్టి భక్తులను నియంత్రించే ఏర్పాట్లు చేయాలి. అలాగే భక్తులకు సరైన సమాచారం ఇచ్చేందుకు పశ్చిమ, తూర్పు రాజగోపురాల వద్ద, రామాలయం వద్ద అవసరమైన ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ లేక అవస్థలు పడుతున్న భక్తులకు నగదు చెల్లింపుల పైనా టిక్కెట్లు ఇచ్చే కౌంటర్లు ఎక్కడ ఉన్నాయన్నది తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని సరిచేయాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement