ముమ్మిడివరం: ఇటీవల కాకినాడలో నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి అండర్–17 స్కేటింగ్ ఎంపిక పోటీల్లో స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థి చందు శ్రీధర్ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. జిల్లా స్థాయి పోటీల్లో రింక్–2 వెయ్యి మీటర్ల విభాగంలో రజతం, రోడ్–1 3000 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. శ్రీధర్‌ను కోచ్ సంపత్, పాఠశాల హెచ్ఎం బి.హనుమంతరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు కోన సందీప్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
క్రీడా సమాచారం


