లో
కపిలేశ్వరపురం: అర్నబ్, మురసు తుపానులు వరుసగా విరుచుకుపడటంతో జిల్లాలో సుమారు 90 వేల హెక్టార్లలో వరి పంట నేలకొరిగి నీటి పాలైంది. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపానికి బలికావడంతో అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 15 రోజులుగా నీటిలోనే నానుతున్న వరి కంకులు కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నాయి. పొలంలోకి దిగిన రైతులకు కాళ్ల దురదలు, ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతుంటే.. మరోవైపు దిగుబడి గణనీయంగా పడిపోవడం, నాణ్యత దెబ్బతినడంతో బియ్యం లభ్యతపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో బియ్యం కొరత ఏర్పడటంతో పాటు కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దిగుబడిపై తీవ్ర ప్రభావం
సాధారణంగా ఎకరాకు 30 నుంచి 35 బస్తాల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని రైతులు ఆశిస్తారు. అయితే తుపాన్ల కారణంగా పంట నీట మునగడంతో ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. పనులు చేసుకునేందుకు అవకాశం ఉన్న పొలాల్లో సైతం ఎకరాకు 10 నుంచి 15 బస్తాలకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. అవి కూడా రోజుల తరబడి నీటిలో ఉండటంతో ధాన్యం మొలకెత్తడం, రంగు మారడం, గింజలు ముక్కలవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ధాన్యాన్ని విక్రయించేందుకు వెళ్లినా వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. నాణ్యత లేదనే సాకుతో ధర తగ్గించి అడుగుతున్నారు. ఫలితంగా పంటను కోసినారైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది.
పెట్టుబడికి కూడా రాక..
వరి సాగు వ్యయం గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు, యంత్రాల అద్దెలు కలిపి ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ.40 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. మరో పది రోజుల్లో పంట చేతికొస్తుందని ఆశించిన సమయంలో తుపాన్లు విరుచుకుపడ్డాయి. పెట్టిన పెట్టుబడి తిరిగి రాని దుస్థితి నెలకొంది. కొన్ని చోట్ల పంట కోతకు కూడా పనికిరాని పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని చోట్ల కోసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు సరైన వాతావరణం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ఆసక్తి చూపకపోవడంతో అన్నదాతలకు నష్టాలు మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోకా... భూ యజమానులకు కౌలు ఎలా చెల్లించాలో దిక్కుతోచని దయనీయ పరిస్థితి నెలకొంది.
బీమాపై రైతుల అసంతృప్తి
మరో వైపు పంటల బీమా విషయంలోనూ రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల తరఫున ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించేదని, ప్రస్తుతం ప్రీమియం చెల్లింపు బాధ్యత రైతులపై పడటంతో అనేక మంది పూర్తిస్థాయిలో బీమా చేయించుకోలేకపోతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ప్రకృతి విపత్తుల సమయంలో బీమా పరిహారం అందక నష్టాలను తామే భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బియ్యం ధరలకు రెక్కలు
వరి పంట దిగుబడి తగ్గితే దాని ప్రభావం ధాన్యం మార్కెట్‌తో పాటు బియ్యం ధరల పైనా పడే ప్రమా దం ఉంది. ఇప్పటికే బియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. జూలైలో కిలో సోనామసూరి బియ్యం ధర సుమారు రూ.65 ఉండగా ప్రస్తుతం నాణ్యత, రకం, బ్రాండ్‌ను బట్టి రూ.85 నుంచి రూ.105 వరకు పలుకుతోంది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు రానున్న రోజుల్లో మరింత భారం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మన జిల్లా వంటి ప్రధాన వరి సాగు ప్రాంతాల్లో దిగుబడి గణనీయంగా పడిపోతే మార్కెట్‌లో ధాన్యం సరఫరా తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచుతారేమోనన్న భయం వినియోగదారుల్లో నెలకొంది. ఇప్పటికే బియ్యం ధరల నిర్ణయంలో రైతుల కంటే మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారుల ప్రభావమే ఎక్కువగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌లో ధరలను నియంత్రించడంతో పాటు అక్రమ నిల్వలను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దురదృష్టవశాత్తూ ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పాలి.
8
శనివారం శ్రీ 14 శ్రీ నవంబర్ శ్రీ 202
ఫ తూర్పుగోదావరిలో గడ్డుకాలం
ఫ నీట మునిగిన
90 వేల హెక్టార్లలో వరి పంట
ఫ ఎకరాకు 10 బస్తాల
దిగుబడి కూడా కష్టమే
ఫ రానున్న రోజుల్లో బియ్యం కొరత
తప్పదని ఆందోళన
ఫ కానరాని ప్రభుత్వ భరోసా
మిల్లింగ్ కేంద్రంగా మండపేట
మండపేట నియోజకవర్గం పరిధిలో పెద్ద సంఖ్యలో రైస్ మిల్లులు ఉన్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గతంలో అక్రమంగా బియ్యం తరలిస్తున్న ఘటనలను అధికారులు గుర్తించి పట్టుకున్న సందర్భాలున్నాయి. సాధారణ రకం ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, మిల్లుల్లో పాలిషింగ్ చేసి ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో బ్రాండింగ్ కల్పించి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు రేషన్‌న్ బియ్యాన్ని కిలో రూ.10 చొప్పున కొనుగోలు చేసి, పాలిషింగ్ అనంతరం కిలో రూ.50 వరకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలపై అధికారులు నిరంతర నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం తుపాన్ల కారణంగా ధాన్యం దిగుబడి తగ్గే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో బియ్యం నిల్వలు, మిల్లింగ్ కార్యకలాపాలు, మార్కెట్‌లో సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతకు తావు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విధానంపై స్పష్టత ఇవ్వాలి. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా నిబంధనల మేరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలి.
భరోసా కల్పించని చంద్రబాబు ప్రభుత్వం
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలి. కానీ తుపాన్లతో పంటలు దెబ్బతిని రోజులు గడుస్తున్నా నష్టపరిహారంపై స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. పంట నూరుశాతం దెబ్బతిన్న సందర్భాల్లో ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినప్పటికీ.. పరిహారం ఎప్పుడు అందుతుంది? ఏ ప్రాతిపదికన నష్టాన్ని అంచనా వేస్తారు? అన్న విషయాలపై స్పష్టత కొరవడింది.
రైతులను ఆదుకోవాలి
ఆరుగాలం అనేక కష్టాలు పడుతూ రైతులు వరిని సాగు చేశారు. తుపాన్ల కారణంగా సుమారు 90 శాతం పంట దెబ్బతింది. పెట్టిన పెట్టుబడి సొమ్మకు భరోసా లేదు. రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి.
– బొక్కా రాంబాబు, కపిలేశ్వరపురం
ధాన్యాగారంగా పేరొందిన తూర్పుగోదావరి జిల్లాకు గడ్డుకాలం వచ్చింది.. వరుస తుపాన్ల కారణంగా వరి చేలు మునిగి పంట మొత్తం తుడిచిపెట్టేసింది.. చేతికందాల్సిన పంట 15 రోజులుగా నీటిలోనే నానుతోంది.. ఇలా కుళ్లి దుర్వాసన వస్తోంది. రైతన్నలకు కష్టాలు మిగిల్చింది. మరోవైపు రానున్న రోజుల్లో బియ్యం దొరుకుతాయా అనే ఆందోళన సామాన్యులను వెంటాడుతోంది.


