గోకవరం: తెలుగుదేశం పార్టీకి గోకవరం మండలంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ గ్రామ మాజీ సర్పంచ్ బత్తుల శ్రీలక్ష్మీ సత్తిబాబు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. వారితో పాటు మరో 60 కుటుంబాలకు చెందిన 185 మంది కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. వారందరికీ వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరాంజీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. బత్తుల సత్తిబాబు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుత పాలన అందించారన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జగ్గంపేట కో ఆర్డినేటర్ తోట నరసింహం, శ్రీరాంజీతో కలిసి పార్టీ బలోపేతానికి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు పాటి రాంబాబు, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు దాసరి చినబాబు, కర్రి సూరారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తుని నియోజకవర్గ పరిశీలకుడు గుల్ల ఏడుకొండలు, మండల సమాచార హక్కు చట్టం అధ్యక్షుడు నున్నం రాంబాబు, సీనియర్ నాయకుడు సమ్మెట్ల మోహన్ (నాని) తదితరులు ఉన్నారు.
ఫ వైఎస్సార్ సీపీలో చేరిన
మాజీ సర్పంచ్ సత్తిబాబు
ఫ మరో 60 కుటుంబాలదీ అదే దారి


