రాజమహేంద్రవరం రూరల్: త్వరలో జరిగే నగరపాలకసంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం బొమ్మూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జక్కంపూడి రాజా, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, గొందేశి శ్రీనివాసులురెడ్డి, మండల అధ్యక్షుడు ఉప్పులూరి వీర వెంకట సత్యనారాయణ, యాదల సతీష్ చంద్ర స్టాలిన్, రాష్ట్ర యువజన విభాగం మాజీ రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే 30 డివిజన్లకు సంబంధించి స్థానిక నాయకులతో చర్చించారు. అభ్యర్థుల ఎంపికలో కేవలం వ్యక్తిగత పరిచయాలు, పార్టీ పట్ల విధేయత మాత్రమే కాకుండా సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, స్థానికంగా ప్రజల్లో ఉన్న ఆదరణ, రాజకీయ సామర్థ్యం, ఎన్నికల నిర్వహణలో అనుభవం, ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొనే శక్తి వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూనే, ప్రతి డివిజన్‌లో గెలుపు అవకాశాలను బేరీజు వేసుకున్నారు.
వెంకట నగరంలో.. .
వెంకట నగరం గ్రామంలో శుక్రవారం సాయంత్రం పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పులూరి వీర వెంకట సత్యనారాయణ అధ్యక్షతన కాతేరు, తొర్రేడు, వెంకటనగరం నాయకుల సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు తదితరులు పాల్గొని ఆయా డివిజన్ల అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఫ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలి
ఫ జిల్లా అధ్యక్షుడు వేణు,
మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
ఫ కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికపై
కసరత్తు


