ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Nov 14 2026 12:47 AM | Updated on Nov 14 2026 12:47 AM

కంబాలచెరువు(రాజమహేంద్రవరం)/దేవరపల్లి: త్వరలో జరగనున్న మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌ కుమార్‌ ఆదేశించారు. ఆయన శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి, ఎస్పీ డి.నరసింహ కిశోర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తిని రానున్న పంచాయతీ, రాజమహేంద్రవరం మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కొనసాగించాలన్నారు. సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఉంచాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై ముందస్తు బైండోవర్‌ చర్యలు చేపట్టాలన్నారు. గ్రామస్థాయి నిఘాను బలోపేతం చేయడంతో పాటు, సామాజిక మాధ్యమ పోస్టులపై పర్యవేక్షణ ఉండాలన్నారు.

దేవరపల్లి పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ

జిల్లా ఎస్పీతో కలిసి దేవరపల్లి పోలీస్‌ స్టేషన్‌ను ఐజీ తనిఖీ చేశారు. స్టేషన్‌ రికార్డులు, కేసు డైరీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, ముఖ్యంగా పోక్సో, ఇతర తీవ్రమైన నేరాల దర్యాప్తులో నాణ్యత పాటించాలని, పటిష్టమైన సాక్ష్యాధారాలు సేకరించి నేరస్తులకు శిక్షలు పడేలా గుడ్‌ ట్రయల్‌ మానిటరింగ్‌ చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ పాటిల్‌ దేవరాజ్‌ మనీష్‌, సెంట్రల్‌ జోన్‌ ఏఎస్పీ తరుణ్‌ పహ్వా, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ ఎల్‌.చెంచి రెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ బి.రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement