వైఎస్సార్‌ సీపీలోకి జనసేన నేత | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి జనసేన నేత

Nov 14 2026 12:47 AM | Updated on Nov 14 2026 12:47 AM

రాజానగరం: మండలం నరేంద్రపురానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు మైరెడ్డి గంగాధర్‌ వైఎస్సార్‌ సీపీలో చేశారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాను స్థానిక నాయకులతో కలిసి రాజమహేంద్రవరంలోని ఆయన స్వగృహంలో శుక్రవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజా ఆయనకు వైఎస్సార్‌ సీపీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గంగాధర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేస్తూ రాజా ముందుకు దూసుకు వెళ్తున్నారన్నారు. అలాగే వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో వివిధ పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్న వైనాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలో రాజాతో కలసి పనిచేయాలని నిర్ణయించుకుని, పార్టీలో చేరినట్టు తెలిపారు. కార్యక్రమంలో నరేంద్రపురానికి చెందిన సొసైటీ మాజీ అధ్యక్షుడు పంపన శ్రీనివాస్‌, ప్రగడ రాంబాబు, జానా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement