ఎన్నికల తిరకాసులు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల తిరకాసులు

Nov 25 2026 12:08 AM | Updated on Nov 25 2026 12:08 AM

సాక్షి, రాజమహేంద్రవరం: ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. రాజకీయ నాయకులు పోటీ చేసినా.. తమ అనుచరులను బరిలోకి దింపినా.. ప్రచారం నుంచి పోలింగ్‌ వరకు భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఇందుకు భిన్నమైన వ్యవహారం జరుగుతోంది. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఎన్నికల ఖర్చుల పేరిట కూటమిలోని ఓ కీలక నాయకుడు భారీగా నిధులు సమీకరిస్తున్నారని అంతా కోడై కూస్తోంది. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టే అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీలు ఇస్తూ, డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు..

రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నిధుల సమీకరణపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయానికి భారీగా ఖర్చవుతుందని చెబుతూ, ఓ కీలక నాయకుడు వివిధ వ్యాపార వర్గాల నుంచి నిధులు సేకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నగరంలోని వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లను సంప్రదిస్తున్నారని స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సమీకరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఎవరెవరి నుంచి ఎంత మొత్తం తీసుకున్నారు.. ఆ నగదు ఏ రూపంలో చేతులు మారిందనేది ఎవరికీ తెలియకుండా గోప్యం పాటిస్తున్నారు.

పుష్కరాల కాంట్రాక్టుల పేరుతో..

ఎన్నికల నిధుల సమీకరణ వ్యవహారంలో గోదావరి పుష్కరాల పనుల ప్రస్తావన రావడం మరింత చర్చకు దారితీస్తోంది. రానున్న పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల్లో అవకాశాలు కల్పిస్తామని కొందరు కాంట్రాక్టర్లకు హామీలు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ హామీలతో భారీగా నిధులు సమీకరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పుష్కరాల కోసం చేపట్టే రోడ్లు, ఘాట్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలకు ప్రజాధనం వెచ్చించాల్సి ఉంటుంది. అటువంటి పనుల కేటాయింపును రాజకీయ విరాళాలతో ముడిపెట్టే ప్రయత్నాలు నిజంగా జరుగుతున్నట్లయితే అది తీవ్రమైన అంశమే. అందువల్ల కాంట్రాక్టర్ల నుంచి నిధుల సేకరణ, భవిష్యత్తు పనుల కేటాయింపుపై వస్తున్న ఆరోపణల నిజానిజాలు తేలాల్సిన అవసరం ఉంది.

అభ్యర్థులకు చేరని సొమ్ము

ఎన్నికల ఖర్చుల కోసం సమీకరిస్తున్నట్లు చెబుతున్న డబ్బు అసలు అభ్యర్థులకు చేరడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు నాయకుడు సేకరించిన సొమ్మును పార్టీ అభ్యర్థుల ప్రచారానికి వినియోగించడం లేదని, తన వద్దే ఉంచుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు చట్టబద్ధంగా విరాళాలు ఇవ్వడం ఒక అంశమైతే, భవిష్యత్తులో ప్రభుత్వ పనులు ఇప్పిస్తామనే హామీతో నిధులు సేకరించడం మరో అంశం. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కోసం ఇచ్చిన విరాళాలకు ప్రతిఫలంగా ప్రభుత్వ కాంట్రాక్టులు కేటాయిస్తామనే హామీలు ఇచ్చినట్లు ఆధారాలు లభిస్తే సంబంధిత వ్యవహారంపై విచారణ జరపాల్సి ఉంటుంది. ముఖ్యంగా పుష్కరాలు వంటి భారీ ప్రజాప్రయోజన కార్యక్రమాలకు సంబంధించిన పనుల్లో పారదర్శకత అత్యంత అవసరం. రాజకీయ పలుకుబడి ఆధారంగా కాకుండా నిబంధనల ప్రకారం కాంట్రాక్టుల కేటాయింపు జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. రాజకీయ విరాళాల సమీకరణ, వాటి వినియోగం, అభ్యర్థుల ప్రచార ఖర్చులు, సంబంధిత ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

·˘ MýS*r-Ñ$ÌZ K MîSÌSMýS ¯éĶæ$-MýS$yìl §ýl…§é

·˘ Æ>fÐ]l$-õßæ…-{§ýl-Ð]lÆý‡…

ఎన్నికలకు నిధుల సమీకరణ

·˘ ÑÑ«§ýl Ð]lÆ>YÌS ¯]l$…_ A{MýSÐ]l$ Ð]lçÜ*â¶æ$Ï

·˘ JMöPMýSPÇ ¯]l$…_ Æý‡*.10 ÌS„ýSÌS-MýS$ Oò³V> ¡çÜ$-MýS$…-r$-¯]l²r$Ï {ç³^éÆý‡…

·˘ {糆-çœ-ÌS…V> ç³#çÙPÆý‡ 糯]l$Ë$

ఇప్పిస్తామంటూ హామీ

·˘ B Ý÷Ð]l¬Ã¯]l$ Ý÷…™é-°MìS

మళ్లిస్తున్నారన్న ఆరోపణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement