ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. బాబూ! | - | Sakshi
Sakshi News home page

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. బాబూ!

Nov 25 2026 12:08 AM | Updated on Nov 25 2026 12:08 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు, మాజీ ఎమ్మెల్యే రాజా

రాజమహేంద్రవరం రూరల్‌: గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 160 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా బాబూ..? రెండున్నరేళ్ల కూటమి పాలనలో దోపిడీలకే ప్రాధాన్యం ఇచ్చారంటూ మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. మంగళవారం నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా 27వ డివిజన్‌ ఆల్కాట్‌తోట ప్రాంతంలో మేయర్‌ అభ్యర్థి దాసి వెంకటరావు, కార్పొరేటర్‌ అభ్యర్థి కన్నూరి లహరిలతో కలసి వేణు, రాజాలు ఇంటింటా పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి సేవ చేసిన మాజీ సైనికుడు దాసి వెంకటరావుకు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. మేయర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులు వెంకటరావు, లహరిలకు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. టీడీపీ ఇచ్చిన హామీలు చేసిన పనులు గమనిస్తే వారు చేసిన మోసం తెలుస్తుందన్నారు. పెన్షన్లు తొలగించడం, విద్యుత్‌ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్‌ అభ్యర్థి దాసి వెంకటరావు మాట్లాడుతూ మేయర్‌గా తనను గెలిపిస్తే రాజమహేంద్రవరం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది, అవినీతి రహిత పాలన అందిస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా శ్రీనగేష్‌, చాపా రాజా, రాంకీ, గేడి అన్నపూర్ణరాజు, నిరీక్షణ జేమ్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement