సీసీ టీవీ ఫుటేజీ పట్టించింది.. | - | Sakshi
Sakshi News home page

సీసీ టీవీ ఫుటేజీ పట్టించింది..

Nov 25 2026 12:08 AM | Updated on Nov 25 2026 12:08 AM

ఆగస్టు 3: ఆ రోజు రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్‌ ఆదిత్య మాల్‌ వద్ద జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆవేదనను నింపింది. జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో పీజీ చదువుతున్న డాక్టర్‌ ప్రియాంక తన సహ విద్యార్థితో కలసి స్కూటీపై వెళ్తుండగా, సూరారపు ధస్వంత్‌, ఆండ్రూ జోసెఫ్‌ ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ప్రియాంకను హైదరాబాద్‌కు తరలించగా, 9న చికిత్స పొందుతూ మరణించారు. నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మొదట నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్‌కు సంబంధించిన సెక్షన్లతో కేసు నమోదు చేయగా, సీసీ టీవీ దృశ్యాలు, ఇతర ఆధారాల పరిశీలన తర్వాత తీవ్రమైన సెక్షన్లు చేర్చారు.

నగర చరిత్రలోనే అత్యంత హేయం

వైద్యురాలిగా సమాజానికి సేవలందించాలన్న యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలచివేసింది. ఉద్దేశపూర్వక దాడిగా పరిగణించి హత్య కేసు నమోదు చేయాలని ప్రియాంక కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. అయితే పోలీసుల దర్యాప్తు తీరుపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. 3న రాత్రి ఘటన జరగగా, నిందితులను 6న అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నప్పటికీ అరెస్టుకు మూడు రోజుల సమయం ఎందుకు పట్టిందన్న ప్రశ్నలు వినిపించాయి. నిందితులను రక్షించేందుకు రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ప్రమాదానికి కారణమైన కారు నంబర్‌ ప్లేట్ల విషయంలోనూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటన సమయంలో ఉన్న నంబర్‌ ప్లేట్లు ఆ తర్వాత కనిపించలేదన్న ఆరోపణలపై పోలీసులు స్పష్టత ఇవ్వనేలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement