అవినీతి లేని అభివృద్ధి చేస్తాం.. | - | Sakshi
Sakshi News home page

అవినీతి లేని అభివృద్ధి చేస్తాం..

Nov 25 2026 12:08 AM | Updated on Nov 25 2026 12:08 AM

● మాజీ ఎంపీ భరత్‌రామ్‌,

మేయర్‌ అభ్యర్థి దాసి వెంకటరావు

● వైఎస్సార్‌ సీపీ మ్యానిఫెస్టో విడుదల

రాజమహేంద్రవరం సిటీ: అవినీతి లేని అభివృద్ధి కోసం.. అరాచక శక్తుల ఆగడాలను అరికట్టడం కోసం.. మన రాజమహేంద్రవరానికి పూర్వ వైభవం తేవడం కోసం నిరంతం కృషి చేస్తామని వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి దాసి వెంకటరావు స్పష్టం చేశారు. మంగళవారం రాజమహేంద్రవరం ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌ సీపీ పది అంశాలతో మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ మేయర్‌గా విజయం సాధించిన 100 రోజుల్లో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని ప్రకటించారు. దీనికి గాను రూ.100 బాండ్‌ పేపరుపై సంతకం చేసి ప్రజలకు హామీ ఇచ్చారు. పూర్తి నమ్మకంతో అవినీతి లేని పాలన అందిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో ఏపీహెచ్‌బీసీ మాజీ చైర్మన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా శ్రీ నగేష్‌, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్‌ కానుబోయిన సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

మ్యానిఫెస్టోలో అంశాలు ఇవి..

● ఆఫీసుల చుట్టూ తిరగొద్దు.. ఇంటి వద్దకే మున్సిపల్‌ సేవలు

● ప్రతి వీధిలో క్యూఆర్‌ కోడ్‌తో కూడిన హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు, పరిష్కరించడానికి నిశ్చిత గడువు, గడువు దాటితే ఫిర్యాదుదారునికి నష్ట పరిహారం అందజేత.

● గోదావరి నది కాలుష్యం కాకుండా చర్యలు

● గోదావరి ఎగువన కాతేరు వద్ద ఇన్‌టెక్‌ పాయింట్‌ ఏర్పాటు

● ప్రతి ఇంటికి నీటి కుళాయి కనెక్షన్‌, శుభ్రమైన నీరు

● ప్రతి డివిజన్‌లో 20 ఎంఎల్‌డీ ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటు

● క్రీడాకారుల కోసం ఆధునిక క్రికెట్‌ స్టేడియం

● ప్రతి సంవత్సరం 4 మెగా జాబ్‌ మేళాలతో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు

● కందుకూరి వీరేశలింగం కళాశాల నుంచి కోటిపల్లి బస్టాండ్‌ వరకు ఫ్లై ఓవర్‌ నిర్మాణం

● ఆధునిక సౌకర్యాలతో చైల్డ్‌ కేర్‌ సెంటర్లు.. ఓల్డ్‌ ఏజ్‌ హోమ్స్‌ ఏర్పాటు

● వంద రోజుల్లో గుంతలు లేని రోడ్లు.. అరుగు నెలల్లో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ

● ముంపు నుంచి విముక్తి, నీరు నిలిచే ప్రాంతాల్లో వర్షాలకు ముందుగా కాలువలు శుభ్రం

● భారం లేని ఇంటి పన్ను విధానం

● 500 చదరపు అడుగుల లోపు ఇళ్లు, ప్లాట్లకు ఆస్తి పన్ను మినహాయింపు

● 15 శాతం పెంచిన ఇంటి పన్ను రద్దు వర్తింపు

● క్రమం తప్పకుండా చెత్త సేకరణ

● ప్రతి డివిజన్‌లో మరుగుదొడ్ల నిర్మాణం

● మహిళల కోసం స్వదేశీ సూపర్‌ బజార్లు

● మిల్లెట్లు, ఆహార పదార్థాలు, పేపరు ప్లేట్లు, కొవ్వొత్తుల తయారీ, ఇతర ఉత్పత్తుల తయారీ

● 72 వార్డుల్లో మల్టీ పర్పస్‌ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం

● ఓపెన్‌ జిమ్‌లు, యోగా, మెడిటేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement