జాతీయ తైక్వాండో పోటీలకు క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

జాతీయ తైక్వాండో పోటీలకు క్రీడాకారులు

Nov 12 2026 12:13 AM | Updated on Nov 12 2026 12:13 AM

పిఠాపురం: జాతీయ టైక్వాండో పోటీలకు 21 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. స్థానిక ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలోని అంబేడ్కర్‌ భవన్‌లో రెండు రోజులు నిర్వహించిన రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వీరిలో స్వర్ణ పతకాలు సాధించిన 21 మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు నిర్వహణ కార్యదర్శి పి.లక్ష్మణరావు వెల్లడించారు. ఎంపికై న వారిలో 10 మంది బాలురు, 11 మంది బాలికలు ఉన్నారని, వీరంతా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తరఫున జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి డాక్టర్‌ వెంకటరెడ్డి, పిఠాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డీఆర్‌కే రెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కాగా..జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీలో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జాతీయ స్థాయి స్కూల్‌ గేమ్స్‌ టైక్వాండో పోటీలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement