కంబాలచెరువు(రాజమహేంద్రవరం): గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు, పటిష్టమైన భద్రత, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం రైల్వే, ఆర్టీసీ, జాతీయ రహదారుల సంస్థ, రవాణా, రెవెన్యూ, పర్యాటక, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో పాటు చైన్నె యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ, ఎర్నెస్ట్ బృందాల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులను చేపట్టాల్సిన పనులపై సూచనలు ఇచ్చారు.


