స్వచ్ఛతలో ‘రాజా’మహేంద్రి | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛతలో ‘రాజా’మహేంద్రి

Nov 12 2026 12:13 AM | Updated on Nov 12 2026 12:13 AM

రాజమహేంద్రవరం సిటీ: పరిశుభ్రతలో నగరం మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025–26 అవార్డుల్లో 3–10 లక్షల్లోపు జనాభా కేటగిరీలో జాతీయ పురస్కారాన్ని కై వసం చేసుకుంది. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మున్సిపల్‌ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, కమిషనర్‌ రాహుల్‌ మీనా ఈ అవార్డును అందుకున్నారు. 2024–25 స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లోనూ నగరాన్ని ప్రతిష్టాత్మక ప్రామిసింగ్‌ స్వచ్ఛ షెహర్‌ అవార్డు వరించింది. ఈ ఏడాది స్వచ్ఛ సిటీ కేటగిరీలో అవార్డును సొంతం చేసుకుంది.

·˘ అవార్డు సాధించిన నగరం

·˘ న్యూఢిల్లీలో రాష్ట్రపతి

చేతుల మీదుగా ప్రదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement