సాక్షి, రాజమహేంద్రవరం: గ్రేటర్ రాజమహేంద్రవరం ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. ఇన్నాళ్లూ న్యాయపరమైన చిక్కులు, విలీన గ్రామాల వివాదాలతో వాయిదా పడుతూ వచ్చిన నగరపాలక సంస్థ ఎన్నికలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఎన్నికల నిర్వహణకు అన్ని అడ్డంకులు తొలగడంతో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలకు సిద్ధమైంది. గురువారం అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, ఈ నెల 26న తొలి విడత పంచాయతీలతో కలిసి పోలింగ్ నిర్వహించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
లైన్ క్లియర్
తొలి విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించాలని తొలుత భావించారు. అయితే నగర పరిధి విస్తరణలో భాగంగా పరిసర గ్రామ పంచాయతీల విలీనంపై వివాదాలు తలెత్తాయి. విలీనాన్ని వ్యతిరేకిస్తూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో ఇతర పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించినప్పటికీ రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా వివాదాలు పరిష్కారం కావడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.
గ్రామాల విలీనంతో గ్రేటర్ రాజమహేంద్రిగా..
రాజమహేంద్రవరంలో పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ అవసరాలకు అనుగుణంగా నగరపాలక సంస్థ పరిధిని విస్తరించాలనే ఉద్దేశంతో గతంలో పరిసర గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియ చేపట్టారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని బొమ్మూరు, రాజవోలు, ధవళేశ్వరం, హుకుంపేట, పిడింగొయ్యి, శాటిలైట్ సిటీ, కోలమూరు, కాతేరు, వెంకటనగరం, తొర్రేడు, కడియం మండలంలోని వేమగిరి పంచాయతీలను విలీనం చేయాలని నిర్ణయించారు. అదే విధంగా రాజానగరం మండలంలోని నామవరం, లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ, దివాన్ చెరువు పరిధిలోని శ్రీరామపురం, రఘునాథపురం, పాలచర్ల, వెలుగుబంధ, చక్రద్వారబంధం, కోరుకొండ మండలంలోని మధురపూడి, బూరుగుపూడి, గాడాల, నిడిగట్ల పంచాయతీలనూ విలీన ప్రతిపాదనలో చేర్చారు. అయితే ఈ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో న్యాయ పోరాటం మొదలైంది. ఫలితంగా ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా కోలమూరుతో పాటు రాజానగరం, కోరుకొండ మండలాల్లోని ప్రాంతాలను విలీనం నుంచి మినహాయించారు. బొమ్మూరు, రాజవోలు, ధవళేశ్వరం, హుకుంపేట, పిడింగొయ్యి, శాటిలైట్ సిటీ, కాతేరు, వేంకటనగరం, తొర్రేడు, వేమగిరి పంచాయతీలతోపాటు లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీని నగర పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో పాత రాజమహేంద్రవరం నగరం గ్రేటర్ రాజమహేంద్రి రూపు సంతరించుకుంది.
మూడు రెట్లు విస్తీర్ణం.. 72 డివిజన్లు
గ్రామాల విలీనంతో నగర భౌగోళిక స్వరూపమే మారిపోయింది. గతంలో 44.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరం ప్రస్తుతం విలీన ప్రాంతాలతో కలిపి మూడు రెట్లు పెరిగి సుమారు 160 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. గతంలో 50 డివిజన్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 72కు చేరింది. గ్రేటర్ రాజమహేంద్రవరం ఎన్నికల్లో మొత్తం 4,63,322 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 2,39,615 మంది మహిళలు, 2,23,637 మంది పురుషులు, 70 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనుంది.
టికెట్ల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు
ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం కావడంతో ఆశావహుల్లో హడావిడి మొదలైంది. ఇప్పటికే పలువురు తమ డివిజన్ల పరిధిలో ప్రచారాన్ని ప్రారంభించారు. మరికొందరు పార్టీ ముఖ్య నేతల వద్ద టికెట్ల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు డివిజన్ల సంఖ్య 50 నుంచి 72కు పెరగడంతో కొత్తగా ఏర్పడిన రాజకీయ అవకాశాలపై నేతలు దృష్టి సారిస్తున్నారు. మేయర్ అభ్యర్థి ఎంపిక కూడా పార్టీలకు కీలక సవాలుగా మారనుంది.
డివిజన్ల వారీగా రిజర్వేషన్లు
డివిజన్ ఓటర్లు రిజర్వేషన్
1 7,588 జనరల్
2 8,834 జనరల్ మహిళ
3 9,179 జనరల్ మహిళ
4 10,557 జనరల్
5 9,458 బీసీ జనరల్
6 5,495 బీసీ జనరల్
7 2,555 బీసీ మహిళ
8 9,793 బీసీ మహిళ
9 6,487 బీసీ మహిళ
10 9,414 బీసీ జనరల్
11 4,284 జనరల్ మహిళ
12 7,509 జనరల్
13 7,921 జనరల్
14 4,941 ఎస్సీ జనరల్
15 4,941 ఎస్సీ జనరల్
16 6,319 జనరల్
17 6,252 బీసీ జనరల్
18 6,969 జనరల్
19 6,132 బీసీ జనరల్
20 4,615 జనరల్ మహిళ
21 7,824 బీసీ జనరల్
22 6,211 బీసీ జనరల్
23 8,323 బీసీ మహిళ
24 7,319 జనరల్
25 7,794 ఎస్సీ మహిళ
26 8,030 జనరల్ మహిళ
27 6,446 జనరల్ మహిళ
28 4,722 బీసీ మహిళ
29 4,371 జనరల్
30 5,993 బీసీ జనరల్
31 5,994 బీసీ మహిళ
32 4,887 జనరల్ మహిళ
33 5,196 జనరల్ మహిళ
34 4,537 జనరల్
35 5,555 జనరల్
36 7,430 బీసీ జనరల్
డివిజన్ ఓటర్లు రిజర్వేషన్
37 6,156 బీసీ మహిళ
38 7,399 జనరల్ మహిళ
39 5,498 ఎస్సీ మహిళ
40 6,454 ఎస్సీ మహిళ
41 5,222 బీసీ మహిళ
42 6,168 జనరల్ మహిళ
43 6,733 జనరల్
44 9,482 జనరల్
45 5,693 జనరల్ మహిళ
46 6,760 బీసీ మహిళ
47 6,085 జనరల్ మహిళ
48 4,981 జనరల్ మహిళ
49 4,299 బీసీ జనరల్
50 3,631 బీసీ జనరల్
51 3,855 జనరల్
52 5,457 జనరల్ మహిళ
53 6,132 బీసీ మహిళ
54 5,672 బీసీ మహిళ
55 7,072 బీసీ మహిళ
56 6,021 బీసీ జనరల్
57 5,809 జనరల్ మహిళ
58 7,081 జనరల్ మహిళ
59 5,258 జనరల్ మహిళ
60 8,019 జనరల్
61 6,558 జనరల్ మహిళ
62 6,014 జనరల్
63 5,381 ఎస్టీ జనరల్
64 7,234 ఎస్సీ జనరల్
65 5,844 జనరల్
66 7,905 ఎస్సీ జనరల్
67 4,936 ఎస్సీ జనరల్
68 6,715 ఎస్సీ మహిళ
69 5,363 బీసీ జనరల్
70 5,508 జనరల్ మహిళ
71 7,669 జనరల్
72 6857 ఎస్సీ మహిళ
·˘ M>Æöµ-Æó‡-çÙ¯ŒS G°²-MýS-ÌSMýS$ Æý‡…VýS… íܧýl®…
·˘ ¯ólyýl$ òÙyýl*ÅÌŒæ
విడుదల చేయనున్న ఎస్ఈసీ
·˘ 72 yìlÑ-f¯]l$Ï,
4.63 లక్షల మంది ఓటర్లు
·˘ GïÜÞ f¯]lÆý‡-ÌŒæMýS$ Ðól$Ķæ$ÆŠ‡ ï³uý‡…
·˘ D ¯ðlÌS 26¯]l G°²-MýSË$
నిర్వహించే అవకాశం
ముమ్మర ప్రయత్నాలు
ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఆశావహుల్లో లెక్కలు మొదలయ్యాయి. నగర మేయర్ స్థానాన్ని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. మొత్తం 72 డివిజన్లలో ఎస్టీ జనరల్‌కు ఒకటి, ఎస్సీ మహిళలకు ఐదు, ఎస్సీ జనరల్‌కు ఐదు, బీసీ మహిళలకు 12, బీసీ జనరల్‌కు 13, జనరల్ మహిళలకు 19, జనరల్‌కు 17 స్థానాలు కేటాయించారు. ముఖ్యంగా ఎస్సీ జనరల్‌కు మేయర్ స్థానం కేటాయించడంతో ఆ వర్గానికి చెందిన రాజకీయ నేతలు, ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.


