● కింద పడి వ్యక్తి మృతి
● ముంగండలో ఘటన
పి.గన్నవరం: ఇటీవల వచ్చిన తుపాను కారణంగా ఇంటిపై పడిన చెట్టును తొలగించే క్రమంలో పైనుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ముంగండ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు కుడుపూడి సూర్యనారాయణ (81) తాటాకింటిపై ఇటీవల వచ్చిన తుపానుకు ఓ చెట్టు కూలిపోయింది. దాన్ని తొలగించేందుకు బుధవారం ఆయన చెట్టుపైకి ఎక్కారు. కొమ్మలను కత్తితో నరికే క్రమంలో అదుపు తప్పి కిందకు పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను అమలాపురంలోని ప్రైవేటు ఆస్పత్రి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కాకినాడలోని మరో ఆస్పత్రికి తీసుకువెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పి.గన్నవరం ఎస్సై ఇ.నరసింహమూర్తి తెలిపారు.


