వైఎస్సార్‌ సీపీకి ఓటు వేస్తారా! | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీకి ఓటు వేస్తారా!

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

కాట్రేనికోన: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి ఓటు వేశారనే కక్షతో ఆ పార్టీ కార్యకర్త కుటుంబంపై టీడీపీ నాయకుడు, అతడి బంధువులు దాడికి పాల్పడ్డారు. కాట్రేనికోన మండలం గెద్దనపల్లి గ్రామంలో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్‌ సీపీకి చెందిన మల్లాడి శ్రీలక్ష్మి, ఆమె భర్త మల్లాడి శ్రీనుపై తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకుడు మల్లాడి లోవరాజు, అతని బంధువులైన బలుసుతిప్పకు చెందిన సుమారు 30 మంది దాడికి పాల్పడ్డారు. శ్రీను ఇంటిపైకి వెళ్లి ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఇంటి ఆవరణలోని మోటార్‌ సైకిళ్లను, సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. ఇంట్లోకి కూడా చొరబడి టీవీ, ఫర్నిచర్‌, వంట సామగ్రి, బీరువా పగులగొట్టి సామగ్రి ధ్వంసం చేశారు. శ్రీలక్ష్మిని జుట్టు పట్టుకొని ఈడ్చేసి, పిడిగుద్దులు గుద్దారు. దుస్తులు పూర్తిగా చిరిగిపోయినా వదల్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి సమయంలో చుట్టుపక్కల మహిళలు అడ్డుకున్నా లెక్క చేయలేదు. కాగా.. దాడిలో తీవ్రంగా గాయపడిన మల్లాడి శ్రీనును స్థానికులు ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పోలింగ్‌ కేంద్రం వద్ద తనను టీడీపీ నేతలు బెదిరించారని, వైఎస్సార్‌ సీపీకి ఓటేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారని శ్రీను చెప్పారు. ఈ క్రమంలోనే తమ ఇంటిపై దాడికి తెగబడ్డారన్నారు.

ఫ ఆ పార్టీ కార్యకర్త కుటుంబంపై

ఇనుప రాడ్లతో దాడి

ఫ గెద్దనపల్లిలో టీడీపీ శ్రేణుల దాష్టీకం

ఫ ఇంట్లోకి చొరబడి విధ్వంసం

నగదు, బంగారం దోచుకున్నారు

ఈ దాడిలో తన కుమారుడి పెళ్లి కోసం బీరువాలో దాచి పెట్టుకున్న రూ.5 లక్షల నగదు, నాలుగు కాసుల బంగారాన్ని కూడా దోచుకుపోయారని బాధితురాలు శ్రీలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు. ఈ నెల 19న తన కుమారుడి పెళ్లి ఉందని, పెళ్లి కోసం దాచిపెట్టుకున్న సొమ్ము పట్టుకుపోయారని, తమ కుమారుడి పెళ్లి ఎలా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి పనుల్లో ఉన్న తమ ఇంటిపై దాడి చేసి పెళ్లి శుభలేఖలు చించేశారని వాపోయారు. వేరే గ్రామానికి చెందిన యువకులు, మహిళలు ఈ దాడికి పాల్పడటంపై స్థానికులు మండిపడుతున్నారు. దాడి ఘటనపై బాధితుడు మల్లాడి శ్రీను కాట్రేనికోన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై దుర్గా శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి వచ్చినప్పటికీ తమ సమస్య పట్టించుకోలేదని శ్రీలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. కాగాా.. దీనిపై కాట్రేనికోన ఎస్సై దుర్గా శ్రీనివాస్‌ను వివరణ కోరగా, మల్లాడి శ్రీను ఆస్పత్రిలో ఉన్నాడని, ఎంఎల్‌సీ రిపోర్ట్‌ ఆధారంగా కేసు నమోదు చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement