పిఠాపురం: స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం 70వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్ – 19 బాల బాలికల తైక్వాండో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డీఆర్కే రెడ్డి అధ్యక్షత వహించగా, తూర్పుగోదావరి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బి.మేరీ సుజాత ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి, పోటీలను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల పరిశీలకుడిగా బాపట్ల జిల్లా నుంచి వెంకట బుజ్జి, జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వేమగిరి శ్రీనివాస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్ – 19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి డాక్టర్ వెంకటరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో కళాశాల లైబ్రేరియన్ హుస్సేన్, సీనియర్ అసిస్టెంట్ పళ్ల సురేష్, పోటీల నిర్వహణ కార్యదర్శి పి.లక్ష్మణరావు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వ్యాయా మ ఉపాధ్యాయులు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.


