ఫ హుండీల్లో 38.700 గ్రాముల
బంగారం, 467 గ్రాముల వెండి
ఫ సరాసరిన రోజుకు రూ.4.08 లక్షలు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానానికి గత 40 రోజులకు గాను హుండీల ద్వారా రూ.1,63,25,461 సమకూరింది. దేవస్థానంలో స్వామివారి హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా రూ.1,54,16,599 నగదు, రూ.9,08,862 చిల్లర నాణేలు వచ్చినట్టు దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. అలాగే 38.700 గ్రాముల బంగారం, 487.650 గ్రాముల వెండితో పాటు కెనడా డాలర్లు 130, అమెరికా డాలర్లు 62, ఇంగ్లాండ్ పౌండ్లు 25, కువైట్ దీనార్లు ఒకటి, సింగపూర్ డాలర్లు 12, యుఏఈ ధీరామ్స్ 15, మలేషియా రింగిట్స్ ఐదు, నేపాల్ రూపాయలు 30, ఖతార్ రియల్స్ ఒకటి వచ్చినట్లు తెలిపారు. ఆశ్వీయుజమాసంలో దసరా సందర్భంగా దేవస్థానానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో గణనీయంగా ఆదాయం పెరిగిందన్నారు. దీంతో గత 40 రోజులలో సరాసరి హుండీ ఆదాయం రూ.04.08 లక్షలుగా నమోదైంది. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం డీసీ బాబూరావు, ఏసీ మంజులాదేవి, ఇతర సిబ్బంది, పలు స్వచ్చంద సేవా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.
లోవ దేవస్థానానికి రూ.63 లక్షల ఆదాయం
తుని రూరల్: లోవలోని తలుపులమ్మ దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. 85 రోజులకు గాను రూ.59,15,405 నగదు, రూ.3,92,114 నాణేలు వెరసి మెత్తం రూ.63,07,519 సమకూరిందని కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. వీటితో పాటు 24.600 గ్రాముల బంగారం, 850 గ్రాముల వెండి లభించిందన్నారు. కాకినాడ ఎంఎస్‌ఎన్ చారిటీస్ ఈఓ, సహాయ కమిషనర్ సీహెచ్ సురేష్ నాయుడు, లోవ ధర్మకర్తల మండలి చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ పర్యవేక్షణలో హుండీలను తెరిచి లెక్కించామన్నారు. ధర్మకర్తలు, శ్రీవారి సేవకులు, బ్యాంకు, ఆలయ సిబ్బంది, నాయీ బ్రాహ్మణులు పాల్గొన్నారు.


