చాగల్లు: పిఠాపురంలో బుధవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు చాగల్లు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పీడీ జె.విజయలక్ష్మి మంగళవారం విలేకరులకు తెలిపారు. గత నెల జరిగిన అండర్–19 ఎస్జీఎఫ్ బాక్సింగ్ జిల్లా ఎంపికల్లో తమ విద్యార్థులు వి.శాంతి, బి.హేమ నవ్యశ్రీ, ఎన్.అనూష, వై.వినయ్ ప్రతిభ చూపారన్నారు. తద్వారా చాగల్లు మండలం నుంచి బాక్సింగ్ పోటీలకు మొట్టమొదటిసారిగా వెళుతున్నారన్నారు. కాగా.. ఆ విద్యార్థులను పాఠశాల హెచ్ఎం ఎస్.వాసవి, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు.
రాష్ట్ర స్థాయి హైజంప్కు కళ్యాణి
అనపర్తి: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మల్లేశ్వరపు కళ్యాణి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై ంది. అండర్–19 బాలికల హైజంప్ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఈ విషయాన్ని ప్రధానోపాధాయయురాలు కె.సుజాత మంగళవారం విలేకరులకు తెలిపారు.


