గుండెల్లో టుబాకు | - | Sakshi
Sakshi News home page

గుండెల్లో టుబాకు

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

దేవరపల్లి: వరుస తుపానులు పొగాకు రైతుల పాలిట శాపంగా మారాయి. అర్నబ్‌ తుపానుకు నిలదొక్కుకున్న తోటలను మురసు పూర్తిగా ముంచేసింది. వరద నీటి ప్రవాహానికి ఇసుక మేటలు వేయడం, పల్లపు ప్రాంతాల్లో భూములు కోతకు గురికావడంతో సాగుకు అనుకూలంగా లేకుండా తయారయ్యాయి. ఇసుక మేటల్లో మళ్లీ తోటలు వేసినా మొక్కను బతికించడం కష్టమని రైతులు వాపోతున్నారు. టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలో దాదాపు 6,400 ఎకరాల్లో పొగాకు తోటలు వేయగా, తుపానుకు సుమారు 4,500 ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

రూ.45 కోట్ల నష్టం!

తుపాను ప్రభావానికి రీజియన్‌ పరిధిలో 4,500 ఎకరాల్లో పొగాకు తోటలు దెబ్బతినగా, సుమారు రూ.45 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు రైతులు అంచనా వేస్తున్నారు. ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి పెట్టి పొగాకు తోటలు వేశామని, దిగుబడులు బాగుంటాయని ఆశిస్తున్న తరుణంలో మురసు ఉసూరుమనిపించిందని ఆవేదన చెందుతున్నారు. ఇసుక మేటలు తొలగించి, కోతకు గురైన భూములను చదును చేయాలంటే ఎకరాకు రూ. 50 వేలు ఖర్చు అవుతుందన్నారు. గత ఏడాది పండించిన పొగాకు ఇంత వరకు అమ్ముడు పోలేదని, కొత్తగా వేసిన పంటను తుపాను ముంచిందన్నారు.

పొగాకు నారుకు డిమాండ్‌

పొగాకు తోటలు కొట్టుకుపోవడంతో మళ్లీ తోటలు వేయడానికి అవసరమైన నారు కొరత ఏర్పడింది. తుపానుకు ముందు ఎకరం నారు (6 వేల మొక్కలు) రూ.4 వేల నుంచి 4,500 ఉండగా, ప్రస్తుతం రూ.20 వేలు పలుకుతున్నాయి. అయినా నారు దొరకడం కష్టంగా ఉందని రైతులు వాపోతున్నారు.

ఫ తుపానుకు తీవ్రంగా

నష్టోయిన పొగాకు రైతులు

ఫ తోటల్లో ఇసుక మేటలు

ఫ 4,500 ఎకరాల్లో దెబ్బతిన్న వైనం

ఫ తడిసిన బేళ్లు

600 పొగాకు బేళ్లు మునక

దేవరపల్లి మండలం సంగాయగూడెంలో వరద నీటి ఉధృతికి రైతుల ఇళ్ల వద్ద ఉన్న సుమారు 600 పొగాకు బేళ్లు తడిచిపోయాయి. వీటి విలువ సుమారు రూ.3.50 కోట్లు ఉంటుందని రైతులు తెలిపారు. ప్రస్తుతం తడిచిన పొగాకు బేళ్లను యంత్రంతో కోసి ఎండలో ఆరబెడుతున్నారు. అయితే రంగు, నాణ్యత దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement