రెడ్‌క్రాస్‌ జిల్లా సెక్రటరీగా కృష్ణ కిశోర్‌ | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ జిల్లా సెక్రటరీగా కృష్ణ కిశోర్‌

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ జిల్లా సెక్రటరీగా కోరుకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ దారపురెడ్డి కృష్ణ కిశోర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కలెక్టర్‌ కీర్తి చేకూరి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన జిల్లా రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని అందరిని సమన్వయం చేసుకుని రెడ్‌ క్రాస్‌ కార్యకలాపాలు విస్తృతం చేస్తానన్నారు.

19న ఎంపీపీ,

వైఎస్‌ ఎంపీపీల ఎన్నిక

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పరిధిలోని 21 మండల ప్రజా పరిషత్తులు, ఒక జిల్లా పరిషత్తులో కోఆప్టెడ్‌ సభ్యులు, ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, జెడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు ఈ నెల 19, 20 తేదీల్లో పరోక్ష ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని కలెక్టర్‌ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. మండల ప్రజా పరిషత్తుల్లో కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికతో పాటు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. అలాగే 20న జిల్లా పరిషత్తులో కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం సంబంధిత ప్రిసైడింగ్‌ అధికారులు నిర్ణీత తేదీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారన్నారు. ఎన్నికై న ఎంపీటీసీ సభ్యులు తమలో ఒకరిని మండల పరిషత్‌ అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారని, అదే విధంగా ఎన్నికై న జెడ్పీటీసీ సభ్యులు తమలో ఒకరిని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌గా, మరొకరిని వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటారన్నారు. ప్రతి మండల పరిషత్‌లో ఒక కో ఆప్టెడ్‌ సభ్యుడిని, జిల్లా పరిషత్‌లో ఇద్దరు కో ఆప్టెడ్‌ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా సంబంధిత గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ సభ్యులకు జారీ చేసే పార్టీ విప్‌ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఎన్నికై న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక సమావేశాల నోటీసులను ఈ నెల 14వ తేదీలోగా అందజేయనున్నారు.

స్టేజ్‌ డ్యూటీల నుంచి

మినహాయింపు ఇవ్వండి

కంబాలచెరువు: జిల్లాలో నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు స్టేజ్‌ 1, 2 రెండు డ్యూటీలు వేయడం అసమంజసమని ఆంధ్రప్రదేశ్‌ ప్రధానోపాధ్యాయ సంఘం పేర్కొంది. జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావుకు మంగళవారం ఆ సంఘం వినతిపత్రం అందించారు. జిల్లాలోని అధిక శాతం మంది ప్రధానోపాధ్యాయులకు, ముఖ్యంగా మహిళా ప్రధానోపాధ్యాయులకు రెండు డ్యూటీలు సుదూర ప్రాంతాలకు వేశారన్నారు. దీనివల్ల వారికి అసౌకర్యం కలగడంతో పాటు, 15 రోజులపాటు పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు దూరంగా ఉంటారన్నారు. దీంతో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న మిషన్‌ మార్చి కార్యక్రమంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయ సంఘం ప్రతినిధులు కోలా సత్యనారాయణ, కేవీ రమణారావు, పల్లి రాజు, ఎస్‌ఎల్‌వీ రమేష్‌, ఎ.మల్లేశ్వరరావు, కె.సుధా తదితరులు పాల్గొన్నారు.

బీచ్‌ రోడ్డు మరమ్మతులు

వేగంగా చేపట్టాలి

కొత్తపల్లి: అర్నబ్‌ తుపాను ప్రభావంతో సముద్ర అల ల ఉధృతికి తీవ్రంగా దెబ్బ తిన్న బీచ్‌ రోడ్డు మరమ్మ తు పనులు వేగంగా చేపట్టాలని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ఉప్పాడ – కాకినాడ బీచ్‌ రోడ్డులో జరుగుతున్న మరమ్మతు పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ తుపాను కారణంగా సుమారు 46 కిలోమీటర్ల పొడవున్న బీచ్‌ రోడ్డు కాకినాడ రూరల్‌, యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని నేమాం, కొమరగిరి, సుబ్బంపేట, ఉప్పాడ, కోనపాపపేటల్లో తీవ్రంగా దెబ్బ తిందని చెప్పారు. తీవ్ర అలల కారణంగా సుబ్బంపేట, కోనపాపపేట ప్రాంతాల్లో నాలుగైదు మీటర్ల లోతు వరకూ రహదారి, కట్ట కొట్టుకుపోయాయని తెలిపారు. దెబ్బ తిన్న రోడ్లు తాత్కాలిక మరమ్మతులకు ఆర్‌అండ్‌బీ అధికారులు రూ.5.41 కోట్లతో అంచనా వేశారన్నారు. ఉప్పాడ శివారు సుబ్బంపేట వద్ద గండి పూడ్చివేతకు రూ.1.95 కోట్లు, కోనపాపపేట వద్ద 100 మీటర్ల పనులకు రూ.1.48 కోట్లు, మరో 120 మీటర్ల పనులకు రూ.1.98 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారని కలెక్టర్‌ వివరించారు.

ఫ 20న జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవికి..

ఫ పరోక్ష విధానంలో నిర్వహణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement