బ్రాహ్మణునికి స్వయంపాకం ఇస్తున్న మహిళ
రావిచెట్టుకు పూజలు చేస్తున్న భక్తులు
పవిత్ర కార్తికమాసం ప్రారంభమైన నేపథ్యంలో హరహర మహాదేవ నామస్మరణతో మంగళవారం గోదావరి తీరం మార్మోగింది. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. సమీపంలో ఆలయాలకు వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. అరటి దోనెల్లో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెట్టారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం


