నేను 50 ఎకరాల్లో పొగాకు తోట వేశాను. తుపాను కారణంగా తోటలు కొట్టుకుపోయి, వాటిలో ఇసుక మేటలు వేశాయి. ఇప్పటికే ఎకరానికి రూ.లక్ష వరకు నష్టం వచ్చింది. ఇసుక మేటలు తొలగించాలంటే ఎకరాకు రూ. 50 వేలు ఖర్చు అవుతుంది. పొగాకు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు.
– వల్లభనేని సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, వెదుళ్లకుంట, గోపాలపురం మండలం
తడిచిన బేళ్లు
భారీ వర్షాలకు ఇంటిలోని 39 పొగాకు బేళ్లు తడిచిపోయాయి. ఒక్కొక్క బేలు 140 కిలోలు ఉంటుంది. వాటిని ఆరబెట్టినప్పటికీ ప్రయోజనం లేదు. రంగు, నాణ్యత పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.2.70 లక్షలు పెట్టుబడి పెట్టి పంట పండించాను. తడిచిన పొగాకు నష్టం సుమారు రూ.6 లక్షలు ఉంటుంది. మా గ్రామంలో దాదాపు 600 బేళ్లు తడిశాయి.
– గద్దే రామారావు, రైతు, సంగాయగూడెం, దేవరపల్లి మండలం
రుణాలు రీషెడ్యూల్ చేయాలి
బ్యాంకుల్లో అప్పులు తెచ్చి రైతులు పొగాకు పంట వేశారు. ఇప్పటికే ఎకరాకు సుమారు రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. తుపాను తీవ్ర నష్టం కలిగించింది. రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. బ్యాంకు రుణాలు రీషెడ్యూల్ చేయాలి. ఎకరాకు రూ. 50 వేలు పెట్టుబడి సాయం ఇవ్వాలి. పొగాకు నారు విత్తనాలు సరఫరా చేయాలి.
– కరుటూరి శ్రీనివాస్, పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు, సంగాయగూడెం, దేవరపల్లి మండలం


