రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Nov 6 2026 12:09 AM | Updated on Nov 6 2026 12:09 AM

మణికొండ: ఇప్పుడే తిరిగి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. తను నడుపుతున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న జలమండలి గోడను ఢీకొనటంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధి గండిపేటలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం, చిన్నయ్యపాలేనికి చెందిన బొంకు చిన్నబ్బాయి తన కుటుంబంతో కలిసి జీవనోపాధి నిమిత్తం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. గండిపేట గ్రామంలో నివాసం ఉంటూ తన భార్యతో కలసి కోకాపేటలోని లెజెండ్‌ చిమ్స్‌ విలేజ్‌లోని ఇళ్లలో పని మనుషులుగా పనిచేస్తున్నారు. వారి చిన్నకుమారుడు బొంకు అజయ్‌(20) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చి ఓ ఫోన్‌ రావటంతో ఇప్పుడే వస్తానని అజయ్‌ బయటకు వెళ్లాడు. కొద్ది సేపటికి రోడ్డు ప్రమాదం జరిగిందని, అక్కడే అజయ్‌ మరణించాడని ప్రమాద స్థలం నుంచి పలువురు తెలిపారు. దాంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అజయ్‌ తలకు తీవ్ర గాయాలతో మరణించి పడి ఉండటాన్ని గమనించారు. అలాగే బైక్‌పై ఉన్న షేక్‌ నబీ రసూల్‌కు కుడికాలు, కుడి చేతికి గాయాలయ్యాయి. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement