నేడు గోపాలపురం మండలంలో పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు గోపాలపురం మండలంలో పోలింగ్‌

Nov 6 2026 12:15 AM | Updated on Nov 6 2026 12:15 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): మురసు తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, ఎరక్రాలువకు వరద ప్రవాహం పెరగడం వల్ల గోపాలపురం మండలంలోని పలు గ్రామాలు, పోలింగ్‌ కేంద్రాలు వరద నీటితో ప్రభావితమయ్యాయని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి తెలిపారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌ సిబ్బంది, ఎన్నికల సామగ్రి సురక్షితంగా తరలించడం, ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గోపాలపురం మండలంలో ఎన్నికల తేదీని వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం నివేదికను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం గోపాలపురం మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి 64 పోలింగ్‌ కేంద్రాల్లో గురువారం జరగాల్సిన పోలింగ్‌ను ఈ నెల 6వ తేదీకి (శుక్రవారం) మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్‌ వెల్లడించారు. అదేవిధంగా, గోపాలపురం మండలంలో రీపోలింగ్‌ అవసరం లేని పక్షంలో నవంబర్‌ 7న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని తెలిపారు. జిల్లాలోని మిగిలిన మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌, ఓట్ల లెక్కింపు షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఫ 18 ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ

స్థానానికి ఎన్నికలు

ఫ నవంబర్‌ 7న కౌంటింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement