రిజిస్ట్రేషన్‌ లేకుండా ఆసుపత్రి నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ లేకుండా ఆసుపత్రి నిర్వహణ

Nov 6 2026 12:15 AM | Updated on Nov 6 2026 12:15 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక క్వారీ ప్రాంతంలో అనధికారికంగా నడుపుతున్న అంకిత ఆసుపత్రి బ్రాంచ్‌ను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారులు గుర్తించారు. దీంతో గురువారం యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పి.కోమలి ఆధ్వర్యంలో అంకిత ప్రైవేట్‌ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఆ హాస్పిటల్‌ యాజమాన్యం రిజిస్ట్రేషన్‌ లేకుండా ఒక బ్రాంచ్‌ని నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. దీనితో వెంటనే నోటీసులు జారీ చేసి రిజిస్ట్రేషన్‌ పొందే వరకు ఆ బ్రాంచ్‌లో వైద్య సేవలు నిలిపివేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఏడు రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి.కోమల మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ లేకుండా నడుపుతున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, రోగులు భద్రత, నాణ్యమైన వైద్య సేవల కోసం జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement