సాక్షి, రాజమహేంద్రవరం: ఎక్కడికక్కడ వర్షపు నీరు.. బురదమయమైన రోడ్లు.. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులు.. పరిషత్ ఎన్నికల పోలింగ్ వేళ ఓటర్లు, సిబ్బందికి ఎదురైన తిప్పలివి. బురద, వర్షపు నీటిలో నడుస్తూనే అవస్థల నడుమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేశారు. అర్నబ్ తుపాను నుంచి జిల్లా తేరుకోక ముందే మురసు తుపానుతో వర్షాలు విరుచుకుపడటంతో పరిషత్ ఎన్నికల పోలింగ్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మార్గాలు నీటితో నిండిపోయాయి. మరికొన్ని చోట్ల రహదారులు బురదమయంగా మారాయి. దీంతో ఓటర్లు ఆయా కేంద్రాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, గ్రామీణ అంతర్గత రహదారుల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికీ వర్షం పరీక్ష పెట్టింది. పోలింగ్‌కు అవసరమైన సామగ్రిని తీసుకుని కేంద్రాలకు చేరుకోవడం కష్టంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో రహదారులు సరిగా లేకపోవడంతో వాహన రాకపోకలకు ఆటంకాలు ఎదురయ్యాయి. వర్షంలోనే ఎన్నికల సామగ్రిని తరలించాల్సి వచ్చింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మూడు మండలాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను అధికారులు మార్చారు. మరోవైపు గోపాలపురం మండలంలో ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చింది.
ఎక్కడెక్కడ ఎలా అంటే..
ఫ చాగల్లు మండలం ఊనగట్ల జెడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో ఓటర్ల కోసం ప్రత్యామ్నాయంగా సమీపంలోని శివాలయం పక్క నుంచి రాకపోకలకు ఏర్పాట్లు చేశారు. అక్కడ కూడా వర్షపునీరు, బురద ఉండడంతో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేసేందుకు ఇబ్బందులు పడ్డారు.
ఫ తాళ్లపూడి జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు వర్షపు నీరు, బురదలో నుంచి వెళ్లేందుకు ఓటర్లు అవస్థలు పడ్డారు.
ఫ నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వర్షపు నీటి ప్రవాహాన్ని దాటేందుకు ట్రాక్టర్‌పై పోలింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి వచ్చింది.
ఫ అనపర్తి బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి నీరు చేరడంతో ఓటేసేందుకు వచ్చిన ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఫ ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన బూత్‌లోకి బురదలో నుంచి వెళ్లేందుకు ఓటర్లు భయపడ్డారు. ఎక్కడ జారిపడతామోనని ఆందోళన చెందారు.
ఫ నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు బురద నీటిలోనే నిరీక్షించాల్సి రావడంతో అసహనానికి గురయ్యారు.
బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం
కొత్తగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌కు తొలి పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు గురువారం నిర్వహించిన పోలింగ్‌తో ఓటర్లు తీర్పు ఇచ్చేశారు. తీవ్ర వర్షాల కారణంగా గోపాలపురం మినహాయించి 20 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక నిర్వహించగా 71 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. జిల్లాలోని 412 ఎంపీటీసీ స్థానాలకు ఏడు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 405 స్థానాలకు 901 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అయితే గోపాలపురం మండలంలో ఎన్నిక వాయిదా వేయడంతో, మిగతా 389 స్థానాలకు 867 మంది అభ్యర్థులు నిలవగా పోలింగ్ నిర్వహించారు. ఈ స్థానాల్లో 11,51,427 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే 20 మండలాల్లో మొత్తం 8,23,672 మంది మాత్రమే ఓటు వేశారు. మొత్తంగా 71.53 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లోకి చేరిపోవడంతో ఇక గెలిచేదెవరో... ఓడేదెవరో శనివారం తేలనుంది. కౌటింగ్ ప్రక్రియ శనివారం ఉదయం నుంచి చేపట్టనున్నారు.
రాజానగరం: సూర్యాపేటలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఓటు వేసినట్లు చూపుతున్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
నిడదవోలు రూరల్ పాలంగి ఎంపీపీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో వరద నీటిలో నిలబడిన ఓటర్లు
ఫ అవస్థల నడుమ ‘పరిషత్’ పోలింగ్
ఫ వర్షం నీరు, బురదలో నుంచే
కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు
ఫ 20 జెడ్పీటీసీ, 389 ఎంపీటీసీ
స్థానాలకు ఎన్నికలు
ఫ రాజానగరంలో అత్యధికంగా 78.68, రాజమహేంద్రవరం రూరల్‌లో అత్యల్పంగా 52.44 శాతం నమోదు
ఫ కపిలేశ్వరపురంలో రిగ్గింగ్‌కు
పాల్పడిన కూటమి నేతలు
ఫ అనపర్తిలో వైఎస్సార్ సీపీ
కార్యకర్తలపై టీడీపీ దాడి
జెడ్పీటీసీ మొత్తం పోలైన పోలింగ్
ఓట్లు ఓట్లు శాతం
అనపర్తి 60,010 40,127 66.87
బిక్కవోలు 57,909 39,950 68.99
రంగంపేట 48,487 37,398 77.27
గోకవరం 57,553 39,834 69.21
కపిలేశ్వరపురం 54,204 36,215 66.81
మండపేట 64,472 43,300 67.16
రాయవరం 52,877 36,141 68.35
కడియం 62,081 44,436 71.58
రాజమండ్రి రూరల్ 23,007 12,064 52.44 కోరుకొండ 64,943 49,901 76.84
రాజానగరం 84,089 66,165 78.68
సీతానగరం 59,382 44,645 75.18
చాగల్లు 52,499 36,439 69.41
కొవ్వూరు 55,640 41,125 73.91
తాళ్లపూడి 41,882 30,138 71.96
దేవరపల్లి 64,755 46,145 71.26
నల్లజర్ల 69,191 52,193 75.43
నిడదవోలు 58,408 42,014 71.93
పెరవలి 57,783 41,468 71.77
ఉండ్రాజవరం 62,255 43,974 70.64
మొత్తం 11,51,427 8,23,672 71.53
నెమ్మదిగా ప్రారంభమై..
జోరందుకుని...
ఉదయం 9కి – 12.09
11కి – 28.52
ఒంటి గంటకు – 44.41
3కి – 59.09
ముగింపు – 71.53
దౌర్జన్యంగా చొరబడి.. రిగ్గింగ్
కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కూటమి నేతలు బరితెగించి రిగ్గింగ్‌కి పాల్పడ్డారు. జనసేన మండపేట నియోజకవర్గ ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ స్వగ్రామం కావడంతో ఆయన ప్రోద్బలంతో జనసేన, టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. స్థానిక ప్రభుత్వ మోడల్ ఎంపీపీ స్కూల్లోని బూత్ నంబర్ 169, 170లోకి కొందరు చొరబడ్డారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసి బయటకు పంపించేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి రోకేష్, బూత్ ఏజెంట్లు బూత్‌లను వదిలేసి బయటకు వచ్చేశారు. అనంతరం కూటమి పార్టీల నాయకులు ఇష్టారాజ్యంగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ కీర్తి చేకూరికి ఫిర్యాదు చేశారు.


