నేడే పుర పోరు | - | Sakshi
Sakshi News home page

నేడే పుర పోరు

Nov 1 2026 12:09 AM | Updated on Nov 1 2026 12:09 AM

ఫ మూడు మున్సిపాలిటీలు,

92 వార్డులకు ఎన్నిక

ఫ మండపేట, కొవ్వూరు, నిడదవోలులో సర్వం సిద్ధం

ఫ 1,08,597 మంది ఓటర్లు, 173 పోలింగ్‌ కేంద్రాలు

ఫ ఉదయం 7 నుంచి

సాయంత్రం 5 వరకు పోలింగ్‌

సాక్షి, రాజమహేంద్రవరం : జిల్లాలోని మండపేట, కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీల్లో ఆదివారం పోలింగ్‌ జరగనుంది. మూడు మున్సిపాలిటీల పరిధిలోని 96 వార్డులుండగా కొవ్వూరులోని నాలుగు వార్డులు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మిగిలిన 92 వార్డులకు బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 1,08,597 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా. ఇందుకోసం 173 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో అభ్యర్థులందరూ పోలింగ్‌పై దృష్టి సారించారు. మరో వైపు అధికారులు పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించారు. ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయించి, పోలింగ్‌ సామగ్రిని సిద్ధం చేశారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మూడు మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు

ఫ కొవ్వూరు మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా 52 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం 34,452 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 16,310 మంది పురుషులు, 18,139 మంది మహిళలు, ముగ్గురు ఇతరులు ఉన్నారు. ఈ మున్సిపాలిటీలో 23 సున్నితమైన, 29 సాధారణ పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. 15 ప్రాంతాల్లో 15 మంది మైక్రో అబ్జర్వర్లను, పోలింగ్‌ విధుల నిర్వహణకు రిజర్వు సిబ్బందితో కలిపి 62 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 62 మంది సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, 177 మంది ఇతర పోలింగ్‌ సిబ్బంది, ఎన్నికల విధుల పర్యవేక్షణకు 3 జోన్లు, 3 సెక్టోరల్‌ అధికారులు, 11 మంది రూట్‌ అధికారులను నియమించారు.

ఫ నిడదవోలు మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా, 49 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 35,086 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 16,570 మంది పురుషులు, 18,516 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీలో 25 సున్నితమైన, 24 సాధారణ పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. 25 ప్రాంతాల్లో మైక్రో అబ్జర్వర్లను, పోలింగ్‌ నిర్వహణకు రిజర్వు సిబ్బందితో కలిపి 59 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 59 మంది సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, 177 మంది ఇతర పోలింగ్‌ సిబ్బంది, ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణకు 9 జోన్లు, 9 సెక్టోరల్‌ అధికారులు, 11 మంది రూట్‌ అధికారులను నియమించారు.

ఫ మండపేట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా, 72 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 49,059 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 23,239 మంది పురుషులు, 25,820 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీలో 18 సున్నితమైన, 36 హైపర్‌ సెన్సిటివ్‌, 18 సాధారణ పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించారు. 27 ప్రాంతాల్లో మైక్రో అబ్జర్వర్లు, పోలింగ్‌ నిర్వహణకు రిజర్వు సిబ్బందితో కలిపి 87 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 87 మంది సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, 260 మంది ఇతర పోలింగ్‌ సిబ్బంది, ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణకు 4 జోన్లు, 4 సెక్టోరల్‌ అధికారులు, 9 మంది రూట్‌ అధికారులను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement