ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి

Nov 1 2026 12:09 AM | Updated on Nov 1 2026 12:09 AM

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): జిల్లాలోని నిడదవోలు, కొవ్వూరు, మండపేట మున్సిపాలిటీల ఎన్నికల పోలింగ్‌ను ఆదివారం స్వేచ్ఛాయుత, పారదర్శక, నిష్పక్షపాత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి తెలిపారు. ఆమె శనివారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం, పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, మైక్రో అబ్జర్వర్ల నియామకం, వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాట్లు సహా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. పోలింగ్‌ విధులకు నియమితులైన సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారని, ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడరాదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement