ఎన్నికల వేళ ఏం చెప్పారంటే...
ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. సామాన్య కుటుంబాలు కట్టెల పొయ్యి మీద కాకుండా గ్యాస్‌తో వంట చేసుకునేందుకు అండగా నిలుస్తాం.
ఎన్నికలయ్యాక ఏం చేశారంటే...
గడిచిన రెండున్నరేళ్లలో ఈ పథకాన్ని పది శాతం మందికి కూడా అమలు చేయలేదు. మొదటి ఏడాది పూర్తిగా విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం తర్వాత నుంచి అక్కడక్కడా కొంత మందికి ఒక్కో సిలిండర్‌కు నగదు ఖాతాల్లో వేసి చేతులు దులిపేసుకున్నారు. వాస్తవానికి తూర్పుగోదావరి జిల్లాలో 52 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 5,12,135 కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో పదో వంతు మందికి కూడా ఏడాదికి మూడు చొప్పున సబ్సిడీ సిలిండర్లు ఇవ్వలేదు.


