ఎన్నికల్లో ‘ఫ్యాన్‌’ ప్రభంజనం ఖాయం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో ‘ఫ్యాన్‌’ ప్రభంజనం ఖాయం

Oct 31 2026 12:07 AM | Updated on Oct 31 2026 12:07 AM

మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

సీతానగరం: స్థానిక ఎన్నికల్లో ఫ్యాన్‌ ప్రభంజనం ఖాయమని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. శుక్రవారం మండలంలోని రాపాకలో ఆయన సమక్షంలో జాలిమూడి, రాపాక గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన 80 మంది వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజా మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభిస్తుందని, అంతా ఐక్యంగా సాగి పార్టీని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ సీపీ సిద్ధాంతాలను, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గూండాల పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు పట్టంకట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజా అన్నారు. అనంతరం రాపాకకు చెందిన చెరుకూరి ప్రసాద్‌, చెరుకూరి కృష్ణ, నలమాటి సత్యనారాయణ, నల్లమోలు పెద్ద, రేలంగి చక్రయ్య, గర్లంక వెంకటసాయి, చుండ్రు సత్యనారాయణ, గర్లంక శ్రీనివాసు (అయ్యప్ప), సుంకవల్లి సత్యనారాయణలతోపాటు 42 మందికి, అదే విధంగా జాలిమూడికి చెందని కాకులపాటి రాజు, డెంకాని నాగేశ్వరరావు, డొక్కా శేఖర్‌, డొక్కా శ్రీను, కాకులపాటి కళ్యాణ్‌, కర్రా చందు, ఉర్ల పాల్‌రాజ్‌, షేక్‌ యాకోప్‌, డొక్కా పండుతో పాటు 38 మందికి పార్టీ కండువాలు వేసి జక్కంపూడి రాజా ఆహ్వానించారు. పార్టీ మండల కన్వీనర్‌ ఘంటా శ్రీనివాస్‌, జెడ్పీటీసీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు, మద్దిపాటి సుబ్బారావు, పిచ్చుకుల విజయ్‌కుమార్‌, రావూరి రామరాజు, పిండి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు

వైఎస్సార్‌ సీపీలోకి చేరికలు

పెదపూడి: వచ్చే నెల 5న జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని వైఎస్సార్‌ సీసీ జిల్లా కమిటీ సభ్యుడు కాకర సాయిబాబు, పార్టీ నియోజకవర్గ పద్మశాలీల సంఘ అధ్యక్షుడు పప్పు సింహాచలం పిలుపునిచ్చారు. పెదపూడి గ్రామంలో ఎంపీటీసీ–1, 2 అభ్యర్థులుగా వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీ చేస్తున్న కొంగర విజయలక్ష్మి, మీసాల పావనిలు శుక్రవారం ఇంటింటా ప్రచారం చేశారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి చెందిన యూత్‌ నేకూరి శ్రీనివాసు, వల్లూరి నరేష్‌, వల్లూరి అశోక్‌, నేకూరి నాగరాజు, దువ్వాకుల వీరబాబు వారితో పాటు మరికొంత మంది వైఎస్సార్‌ సీపీలో భారీగా చేరారు. వారికి సాయిబాబు, సింహాచలం, పార్టీ మండల బీసీసెల్‌ కన్వీనర్‌ సమ్మంగి దుర్గాప్రసాద్‌, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ మార్ని కామరాజు చౌదరి, గ్రామ కన్వీనర్‌ మీసాల నాగరాజు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement