నష్టం అపారం.. భరోసా శూన్యం! | - | Sakshi
Sakshi News home page

నష్టం అపారం.. భరోసా శూన్యం!

Oct 31 2026 12:07 AM | Updated on Oct 31 2026 12:07 AM

సాక్షి, రాజమహేంద్రవరం: కళ్లముందే పంట నేలకొరిగింది.. రెక్కల కష్టమంతా నీటిలో కలిసిపోయింది.. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి ఆవిరైంది.. చేతికొస్తుందనుకున్న పంట తుపాను గాలులకు బలైపోవడంతో అన్నదాతలకు శోకం మిగిలింది. అర్నబ్‌ తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. ఒకవైపు అప్పుల భారం.. మరోవైపు పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడం రైతన్నలకు భారంగా పరిణమించింది. ఇంతటి విపత్తు సంభవించినా చంద్రబాబు ప్రభుత్వం నుంచి కనీస భరోసా దక్కకపోవడం శోచనీయం.

కళ్లముందే కూలిన ఆశల పంట

ఈ ఏడాది పంట బాగా పండుతుందని.. దిగుబడి చేతికొస్తే అప్పులు తీర్చి కుటుంబాన్ని గట్టెక్కించుకోవచ్చని రైతులు ఆశపడ్డారు. సాగు కోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చుల నిమిత్తం అప్పులు చేశారు. వేసవిని తలపించే ఎండలను సైతం తట్టుకుని పంటలను కాపాడుకుంటూ వచ్చారు. జిల్లా వ్యాప్తంగా 92 వేల హెక్టార్లలో వరి, 12,500 హెక్టార్లలో అరటి, 6 వేలకుపైగా హెక్టార్లలో మినుములు, ఉద్యానవన పంటలు సాగు చేశారు. ముఖ్యంగా వరి కోతల సమయం సమీపిస్తున్న తరుణంలో అర్నబ్‌ తుపాను రూపంలో ప్రకృతి విరుచుకుపడింది. బలమైన ఈదురు గాలులకు వరి పొలాలు నేలవాలాయి. చేతికొచ్చే దశలో ఉన్న 50 వేల హెక్టార్లలోని వరి పంట నీటి పాలైంది. ఎకరానికి రూ.70 వేల లెక్కన ఆదాయం వస్తుందనుకుని వరి సాగుచేసి నష్టపోయిన 80 వేల మంది రైతులకు సుమారు రూ.8,500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మరోవైపు అరటి, ఇతర పంటలకు ఇప్పటి వరకూ సుమారు రూ.600 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. ఈ దశలో నెలల తరబడి పడిన శ్రమ కళ్లముందే నీటిపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అప్పులు తీర్చే మార్గం లేక..

పంట చేతికొస్తే పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చుకోవచ్చని ఆశించిన రైతులకు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. వడ్డీ వ్యాపారుల వద్ద, బ్యాంకుల్లో అప్పులు తెచ్చి సాగు చేసిన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట నష్టంతో ఆదాయం లేకపోగా.. పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు ఎలా భరించాలో తెలియక సతమతమవుతున్నారు.

మొత్త‘మోంథా’ కోల్పోయినా..

గతంలో మోంథా తుపాను కారణంగా జరిగిన పంట నష్టానికే ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం పరిహారం అందించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటలను అధికారులు పరిశీలించడం, నివేదికలు పంపడం తప్ప తమ చేతికి పరిహారం అందిన దాఖలాలు లేవని చెబుతున్నారు.

ఫ అర్నబ్‌ దెబ్బకు కుదేలైన అన్నదాతలు

ఫ 50 వేల హెక్టార్లలో

వరి పంట నీటిపాలు

ఫ అరటి, ఇతర పంటలూ ధ్వంసం

ఫ ఆదుకునేందుకు హామీ ఇవ్వని

చంద్రబాబు సర్కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement