నిధుల దుర్వినియోగంపై వ్యక్తికి ఏడాది జైలు | - | Sakshi
Sakshi News home page

నిధుల దుర్వినియోగంపై వ్యక్తికి ఏడాది జైలు

Oct 29 2026 3:29 PM | Updated on Oct 29 2026 3:29 PM

కిర్లంపూడి: ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వ్యక్తికి ఏడాది జైలు, రూ.వెయ్యి జరిమానా విధించినట్టు జగ్గంపేట సీఐ బి.తిరుపతిరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. జగపతినగరం అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో అసిస్టెంట్‌ సూపర్‌ వైజర్‌గా పనిచేసిన బండెల సురేష్‌ రూ.20,08,570 ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్టు కేసు నమోదైంది. దీంతో స్థానిక ఎస్సై జి.సతీష్‌ ఆధ్వర్యంలో నిందితుడిని కోర్టుకు తరలించగా, నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి లంకా గోపీనాత్‌ పై విధంగా శిక్ష ఖరారు చేశారు.

అనుమానాస్పద స్థితిలో బీటెక్‌ విద్యార్థి మృతి

విజయనగరం టౌన్‌: స్థానిక సెంచూరియన్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ 4వ సంవత్సరం చదువుతున్న కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన యశస్విన్‌ భార్గవ్‌ (21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి వన్‌టౌన్‌ ఎస్సై ప్రసన్న కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తన నలుగురు స్నేహితులతో కలిసి భార్గవ్‌ కేఎల్‌ పురంలో ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం స్నేహితులందరూ బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఆ సమయంలో గదిలోని సీలింగ్‌ కొక్కానికి ఉరి వేసుకున్నాడు. స్నేహితులు తిరిగి వచ్చేసరికి వేలాడుతూ కొన ప్రాణంతో కనిపించిన భార్గవ్‌ను కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుడి తండ్రి చిత్ర రామజోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రసన్నకుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement