డేవిడ్‌ రాజుకు సోదర వియోగం | - | Sakshi
Sakshi News home page

డేవిడ్‌ రాజుకు సోదర వియోగం

Oct 29 2026 3:29 PM | Updated on Oct 29 2026 3:29 PM

కొత్తపేట: వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌ రాజు సోదరుడు, ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు గొల్లపల్లి జ్ఞాన ప్రకాష్‌ (71) మంగళవారం రాత్రి గుండె గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. జ్ఞాన ప్రకాష్‌ మృతి సమాచారంతో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి బుధవారం ఉదయం హుటాహుటిన కొత్తపేటలో డేవిడ్‌ రాజు స్వగృహానికి చేరుకుని జ్ఞాన ప్రకాష్‌ భౌతిక కాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సోదర వియోగంతో బాధపడుతున్న డేవిడ్‌ రాజును, జ్ఞాన ప్రకాష్‌ కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జగిరెడ్డితో పాటు మాజీ ఎంపీపీ మార్గన గంగాధరరావు, వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, రాష్ట్ర పార్టీ ప్రచార కార్యదర్శి ముసునూరు వెంకటేశ్వరరావు, స్థానిక జెడ్పీటీసీ అభ్యర్థి బండారు సత్తిరాజు (రాజా), జిల్లా కాపునాడు నాయకుడు చల్లా ప్రభాకరరావు తదితరులు జ్ఞానప్రకాష్‌ భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement