తేలిన లెక్క.. పోటీలో పక్కా.. | - | Sakshi
Sakshi News home page

తేలిన లెక్క.. పోటీలో పక్కా..

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

ఫ పరిషత్‌ పోరులో అభ్యర్థుల ఖరారు

ఫ ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

ఫ జెడ్పీ బరిలో 73 మంది,

ఎంపీటీసీ స్థానాల్లో

సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్‌: కొత్తగా ఏర్పాటైన తొలి జిల్లా పరిషత్‌ పోరులో నిలిచేదెవరో తేలిపోయింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేశారు. జిల్లాలోని 21 జెడ్పీటీసీ స్థానాలకు 166 మంది నామినేషన్లు వేశారు. వాటిలో నాలుగింటిని అధికారులు తిరస్కరించి 162 ఆమోదించారు. మంగళవారం సాయంత్రానికి వాటిలో 82 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 73 మంది పోటీలో నిలిచారు. అత్యధికంగా చాగల్లు, రంగంపేట, సీతానగరం, తాళ్లపూడి జెడ్పీటీసీ బరిలో ఐదుగురేసి అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తంగా చూస్తే వైఎస్సార్‌ సీపీ 21, టీడీపీ 13, జనసేన 7, బీజేపీ 1, కాంగ్రెస్‌ 16, బీఎస్పీ 7, స్వతంత్రులు 8 మంది పోటీలో నిలిచారు.

ఎన్నికల తేదీపై స్పష్టత కరువు

పరిషత్‌ పోరులో కీలకమైన నామినేషన్లు, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఎన్నికల తేదీపై నేటికీ ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 3న ఎన్నికలు నిర్వహించాలి. అవసరమైన చోట 4న రీ పోలింగ్‌ చేపట్టి 5న ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. అయితే మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ నెల 28న నిర్వహించాల్సిన పుర పోరును నవంబర్‌ 1కి వాయిదా వేశారు. అవసరమైన చోట 2న రీపోలింగ్‌ నిర్వహించి 3న కౌంటింగ్‌ ప్రక్రియ చేపడతారు. అందువల్ల నవంబరు 3న మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌, అదే రోజు పరిషత్‌ ఎన్నికలు నిర్వహించడం అధికారులకు, పోలీసులకు సవాల్‌ లాంటిదే. అందువల్ల పరిషత్‌ ఎన్నికల తేదీ మార్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే ఎన్నికల సంఘం పరిషత్‌ ఎన్నికల తేదీ మారుస్తూ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జెడ్పీటీసీ బరిలో నిలిచింది వీరే..

మండలం వైఎస్సార్‌ సీపీ కూటమి

అనపర్తి కొండేటి భీమేశ్వరస్వామి వాసంశెట్టి నాగేశ్వరరావు

బిక్కవోలు కొవ్వూరి సుజాత నల్లమిల్లి ఆదిలక్ష్మి

చాగల్లు మట్టా వీరాస్వామి జొన్నకూటి సుబ్బారావు

దేవరపల్లి ఆచంట అనసూయ అండ్రు రాధిక

గోకవరం దాసరి వెంకటలక్ష్మి టీనా కేర్లిన్‌ హలోనెన్‌

గోపాలపురం ముచ్చకర్ల వరలక్ష్మి కాకర్ల రామతులసి

కడియం కొత్తపల్లి నాగశివాజీ రత్నం మహేశ్వరీదేవి

కపిలేశ్వరపురం గొల్లపల్లి సోనియా దాసి మీనాకుమారి

కోరుకొండ నక్కా రాజేశ్వరి పెంకి లక్ష్మీ సుజాత

కొవ్వూరు బండి పట్టాభి రామారావు పెరుగు పోతురాజు

మండపేట కుసు లింగ దొరాజీ నల్లమిల్లి వీర్రెడ్డి

నల్లజర్ల బంక అప్పారావు ఇజ్జరోతు నాగసత్యనారాయణ

నిడదవోలు తిరుమల భాగ్యలక్ష్మి పంతాల పల్నాటి రజని

పెరవలి గండేపల్లి శ్రీరామకృష్ణ అతికాల వెంకటరామకృష్ణమ్మ

రాజమండ్రి రూరల్‌ మెల్లిమి గంగరాజు తాడేపల్లి నాగరాజు

రాజానగరం ప్రగడ అరుణ బచ్చు శ్యామల

రంగంపేట లంకా చంద్రదుర్గ ఆళ్ల శిరీష

రాయవరం పాలికి రాఘవ కాద పద్మ

సీతానగరం కరుటూరి శ్రీహరిబాబు బత్తుల వెంకటలక్ష్మి

తాళ్లపూడి జొన్నకూటి వెంకటలక్ష్మి కొక్కిరిపాటి అనంతలక్ష్మి

ఉండ్రాజవరం రఘుమండ తేజశ్రీ వేముల వెంకట మంజుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement