నగరాన్ని సర్వనాశనం చేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

నగరాన్ని సర్వనాశనం చేస్తున్నారు

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ పాలనలో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తే కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ సర్వనాశనం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక చర్చి గేటు వద్ద నుంచి గీతా అప్సరా థియేటర్‌ వరకు పైప్‌లైన్లు వేయడానికి తవ్విన రహదారులను ఆయన మంగళవారం పరిశీలించారు. రోడ్డుపై తవ్విన గోతిలో పడుకుని వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం, అధికారులు మతి లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పైప్‌లైన్‌కు తవ్విన పెద్ద గోతుల్లో పడి ఎవరికై నా ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. పనులు వేగంగా పూర్తి చేసి వెంటనే గోతులు పూడ్చి తారు రోడ్డు వేయాలని డిమాండ్‌ చేశారు. నగరంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. కొంత కాల మరిమితి పెట్టి కాంట్రాక్టర్‌తో ఎందుకు పనులు చేయించలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు, వాహన చోదకులకు అసౌకర్యం కలిగితే సహించేది లేదన్నారు. కలెక్టర్‌, కమిషనర్‌ తక్షణం స్పందించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తుపాన్‌ ప్రభావంతో వర్షాలు కురిసి ఆ గోతుల్లో నీరు చేరితే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని, ఆమరణ దీక్ష కూడా పార్టీ చేపడుతుందని హెచ్చరించారు. ఆయన వెంట పార్టీ వార్డు ఇన్‌చార్జి కాటం రజనీకాంత్‌, కాటం ప్రియాంక, పార్టీ నాయకులు దాసి వెంకటరావు, అజ్జరపు వాసు, మజ్జి అప్పారావు, మార్తి లక్ష్మి, నిరీక్షణ జేమ్స్‌, యజ్జవరపు శ్రీనివాస్‌, షేక్‌ హసీనా, కృష్ణవేణి, పీతా రామకృష్ణ, కొల్లినాని, మద్దు సతీష్‌, దూలం ప్రసాద్‌ పాల్గొన్నారు.

పైప్‌లైన్లకు తవ్విన గోతులతో

రెండు నెలలుగా ప్రజలకు అవస్థలు

తారు రోడ్డు వేసి పనులు రాకపోకలు

పునరుద్ధరించాలి

గీతా అప్సరా థియేటర్‌ రోడ్డులో మాజీ ఎంపీ భరత్‌ నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement