నేడు పలు రైళ్ల రద్దు | - | Sakshi
Sakshi News home page

నేడు పలు రైళ్ల రద్దు

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

రాజమహేంద్రవరం సిటీ: తుపాను కారణంగా జిల్లా మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను బుధవారం రద్దు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ 75693 05679 ద్వారా రద్దయిన రైళ్ల వివరాలు తెలుసుకోవచ్చని రైల్వే స్టేషన్‌ చీఫ్‌ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ సుంకర చంద్రమౌళి తెలిపారు.

సికింద్రాబాద్‌ – హౌరా (12704), సికింద్రాబాద్‌ – భువనేశ్వర్‌(17006), హైదరాబాద్‌ – విశాఖపట్నం (12728), మహబూబ్‌నగర్‌ – విశాఖపట్నం (12862), సికింద్రాబాద్‌ – విశాఖపట్నం (12740), లింగంపల్లి – కాకినాడ (12776), లింగంపల్లి – కాకినాడ (12738), నాందెడ్‌ – చంబల్పూర్‌ ( 20810), చర్లపల్లి – శ్రీకాకుళం (07037,) రాజమహేంద్రవరం – విజయవాడ (67261), నర్సాపూర్‌ – రాజమహేంద్రవరం (67246), విజయవాడ – కాకినాడ (17257), కాకినాడ – రాజమహేంద్రవరం (67302), విజయవాడ – రాజమహేంద్రవరం(67202), విజయవాడ – రాజమహేంద్రవరం (67262), రాజమహేంద్రవరం – కాకినాడ(67301), కాకినాడ – విశాఖపట్నం (17267), కాకినాడ – విజయవాడ(17258), రాజమహేంద్రవరం – విశాఖపట్నం (67285), విశాఖపట్నం – రాజమహేంద్రవరం (67486) రైళ్లను రద్దు చేశామన్నారు.

డిప్లొమా కోర్సుల్లోప్రవేశాలకు దరఖాస్తులు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): పభుత్వ వైద్య కళాశాలలో 2026 – 27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల్లో మిగిలిన ఖాళీల భర్తీకి రెండో దశ ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్‌ ఎంఎస్‌ రాజు మంగళవారం తెలిపారు. వివిధ డిప్లొమా కోర్సుల్లో మొత్తం 43 ఖాళీలు అందుబాటులో ఉన్నాయన్నారు. డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీలో 16, డిప్లొమా ఇన్‌ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌లో 9, డిప్లొమా ఇన్‌ ఈసీజీ టెక్నీషియన్‌లో 9, డిప్లొమా ఇన్‌ అనస్థీషియా అండ్‌ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీలో 9 ఖాళీలు ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ప్రభుత్వ వైద్య కళాశాల, రాజమహేంద్రవరం కార్యాలయంలో సమర్పించాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ నవంబర్‌ 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందన్నారు. ఖాళీలను రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం భర్తీ చేయనున్నామన్నారు. మరిన్ని వివరాలకు కళాశాల అధికారిక వెబ్‌సైట్‌ జీఎమ్‌సీ.రాజమహేంద్రవరం.ఏపీ.గవ్‌.ఇన్‌, ఈస్ట్‌గోదావరి.ఏపీ.గవ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లలో చూడవచ్చన్నారు.

లంచం అడిగితే సమాచారమివ్వండి

కంబాలచెరువు(రాజమహేంద్రవరం):ప్రభుత్వ సేవలకు ఎవరైనా లంచం అడిగితే మౌనంగా ఉండకుండా ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ కోరారు. విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌ 2026 వారోత్సవాల్లో భాగంగా అవినీతి నిరోధక శాఖ రూపొందించిన పోస్టర్‌ను జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఏసీబీ ఏఎస్పీ ఎస్‌.భవ్య కిశోర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు చైతన్యవంతులై, చట్టబద్ధమైన మార్గాల్లో ఫిర్యాదు చేయడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకతకు తోడ్పడాలన్నారు. ఏఎస్పీ భవ్యకిశోర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు లంచం అడిగినా, అవినీతికి పాల్పడినా, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలిసినా వెంటనే ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పోలవరం జిల్లాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరు 1064కు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే రాజమహేంద్రవరం ఏసీబీ కార్యాలయం 0883 2467833, విజయవాడ ఏసీబీ ప్రధాన కార్యాలయం 0866 2428770, 9440440057ను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement