సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): అర్నాబ్ తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. వాతావరణ అంచనాల ప్రకారం తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నాయన్నారు. బలమైన గాలుల కారణంగా చెట్లు, హోర్డింగులు, బ్యానర్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశామని, జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సంబంధిత కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలన్నారు. తుపాను ప్రభావం తగ్గే వరకు సినిమా థియేటర్లు, వైన్ షాపులు, కిరాణా, ఇతర దుకాణాలు మూసివేయాలన్నారు. ఈ ఆదేశాల అమలుకు డీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎకై ్సజ్, రెవెన్యూ, సివిల్ సప్లయిస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఫ యూత్ రెడ్ క్రాస్ సేవలను విస్త్రతం చేయాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్, కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో యూత్ రెడ్ క్రాస్ నోడల్ ఆఫీసర్స్ ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కళాశాలల్లో యూత్ రెడ్ క్రాస్ వలంటీర్లును రిజిస్టర్ చేయించాలని , వారి ద్వారా వినూత్న కార్యక్రమాలు నిర్వహించాలని, పుష్కరాలకు సేవలందించే వలంటీర్ల జాబితా అందించాలని కోరారు. జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి కళాశాల నుంచి యూత్ రెడ్ క్రాస్ వలంటీర్లకు బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇప్పించాలని సూచించారు.
ఫ ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా
ఉండాలి
ఫ సహాయం కోసం కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
ఫ కలెక్టర్ కీర్తి చేకూరి


