రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక

Oct 2 2026 12:28 AM | Updated on Oct 2 2026 12:28 AM

రంగంపేట: రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయి స్కూల్‌ గేమ్స్‌ అండర్‌–17 అథ్లెటిక్స్‌ పోటీల్లో రంగంపేట జెడ్పీ హైస్కూలు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ప్రధానోపాధ్యాయుడు వి.పార్థసారథి గురువారం ఈ వివరాలు వెల్లడించారు. ట్రిపుల్‌ జంప్‌లో గుబ్బల ఉషశ్రీ ప్రథమ, కారి నాగభవ్య ద్వితీయ; పోల్‌వాల్ట్‌లో వానపల్లి ప్రసన్న ప్రథమ, దోనాదుల ప్రశాంతి ద్వితీయ; 400 మీటర్ల హర్డిల్స్‌లో పెద్దింశెట్టి శృతి ప్రథమ, కారి నాగభవ్య తృతీయ; లాంగ్‌జంప్‌లో గుబ్బల ఉషశ్రీ తృతీయ స్థానాలు సాధించారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఉషశ్రీ, నాగభవ్య, ప్రసన్న, ప్రశాంతి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యాయామోపాధ్యాయులు శైల, వీరబాబులను పాఠశాల విద్యా శాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్‌జేడీ) నాగమణి అభినందించారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ఎంఈఓలు కె.శ్రీనివాసరావు, పి.మధుసూదనరావు, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement