అంబాజీపేట: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యాన అండర్–17 బాలికల ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టును గురువారం ఎంపిక చేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) జిల్లా కార్యదర్శులు కె.గణేశ్వరరావు, వైఎస్‌ఎస్ ఉషారాణి తెలిపారు. అంబాజీపేట జెడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఈ ఎంపికలను అమలాపురం డీవైఈఓ డీకే కిషోర్ కుమార్ ప్రారంభించారు. ఆర్.నాగకుమార్, పి.శ్రీనివాసరెడ్డి, బి.శ్రీను, ధర్మశేఖర్, పీడీ కుంపట్ల ఆదిలక్ష్మి పర్యవేక్షనలో ఎంపికలు జరిగాయి. తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల నుంచి 40 మంది బాలికలు పాల్గొన్నారన్నారు. క్రికెట్ జట్టు ఎంపికను హెచ్‌ఎం కడలి సాయిరామ్ తదితరులు పరిశీలించారు.


