ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్‌ఐ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్‌ఐ ఎంపికలు

Oct 1 2026 12:35 AM | Updated on Oct 1 2026 12:35 AM

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌ఐ) ఆధ్వర్యాన స్థానిక జిల్లా క్రీడా మైదానంలో జిల్లా స్థాయి ఎంపికలు బుధవారం ఉత్సాహంగా జరిగాయి. అండర్‌–14, 17, 19 బాలురు, బాలికల విభాగాల్లో రగ్బీ, టెన్నిస్‌, ఫుట్‌బాల్‌, టంకట, వుషూ, వెయిట్‌ లిఫ్టింగ్‌లో క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నామని ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి శ్రీనివాస్‌ చెప్పారు. రగ్బీకి 230 మంది, టెన్నిస్‌కు 190 మంది, ఫుట్‌బాల్‌కు 150, టంకటాకు 200, వుషూకు 150, వెయిట్‌ లిఫ్టింగ్‌కు 120 మంది హాజరయ్యారు. ఈ ఎంపికలను చేయూత సంస్ధ నిర్వాహకుడు రవి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ సతీష్‌ కుమార్‌, పీడీలు పట్టాభి, బంగార్రాజు, జార్జి, ప్రసాద్‌, తైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు, తదితరులు పాల్గొన్నారు.

3న హ్యాండ్‌బాల్‌ ఎంపికలు

జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యాన అక్టోబర్‌ 3న హ్యాండ్‌బాల్‌ అండర్‌–14, 17 బాలుర విభాగంలో ఎంపికలు జరుగుతాయని ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి శ్రీనివాస్‌ తెలిపారు. బాలికల విభాగంలో ఎంపికలు దసరా తరువాత జరుగుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement