చిన్న చిత్రాలను ఆదరించాలి | - | Sakshi
Sakshi News home page

చిన్న చిత్రాలను ఆదరించాలి

Sep 19 2026 8:32 AM | Updated on Sep 19 2026 8:32 AM

● ప్రముఖ నటుడు గౌతం రాజు

● సందడిగా ‘అనగనగా తూర్పులంకలో’ చిత్రీకరణ

మామిడికుదురు: గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘అనగనగా తూర్పులంకలో’ చిత్రం సన్నివేశాలను మండలంలోని నగరంలో శుక్రవారం చిత్రీకరించారు. చిత్ర కథానాయకుడు రాజు, ప్రముఖ నటుడు గౌతం రాజు తదితరులపై దర్శకుడు పవర్‌ వినయ్‌ చిత్రీకరిస్తున్న సన్నివేశాలను చూసేందుకు స్థానికులు రావడంతో కోలాహలం నెలకొంది. చిత్ర దర్శకుడు పవర్‌ వినయ్‌ మాట్లాడుతూ గ్రామీణ వాతావరణంలో సాగుతున్న ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉంటాయని తెలిపారు. చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతోందని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వీవీ రాంబాబు తెలిపారు.

చిన్న చిత్రాలతోనే పరిశ్రమకు పూర్వ వైభవం: గౌతం రాజు

చిత్రీకరణలో పాల్గొన్న సీనియర్‌ నటుడు గౌతం రాజు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ చిత్ర పరిశ్రమకు పెట్టింది పేరని, ఇక్కడే సినీ ఇండస్ట్రీ పుట్టి పెరిగిందని గుర్తుచేశారు. చిన్న చిత్రాలను ఆదరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. తద్వారా ఎందరో ప్రతిభావంతులైన కళాకారులకు ఉపాధి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement