గోకవరం: మండలం కామరాజుపేట శివారులో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోకవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు శుక్రవారం ప్రయాణీకులతో అడ్డతీగల వెళ్తోంది. కామరాజుపేట శివారు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జగ్గంపేటకు చెందిన వామిశెట్టి ఆనంద్‌కుమార్ (26) తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాపారం నిమిత్తం నెల్లిపూడికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై పవన్‌కుమార్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


