మరణ శాసనం రాసుకుని.. | - | Sakshi
Sakshi News home page

మరణ శాసనం రాసుకుని..

Aug 18 2026 12:21 AM | Updated on Aug 18 2026 12:21 AM

ఎంత కాలం నుంచి నూకరాజు ఇబ్బంది పడుతున్నారో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన ఆయన చివరకు తన మరణ శాసనాన్ని తానే రాసుకుని అవమానం, భయం ముంచెత్తిన వేళ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. చివరి క్షణాల్లో తాను రాసిన సూసైడ్‌ నోట్‌ను తన సహచర ఉద్యోగుల వాట్సాప్‌ గ్రూప్‌లో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పోస్టు చేసినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అది చూసిన సహచర ఉద్యోగులు కంగారు పడి ఆయన నివాసముంటున్న కాకినాడలో ఆయన ఇంటికి వెళ్లి చూడగా, ఇంటికి తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన సెల్‌కు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో ఆయన కారు డ్రైవర్‌కు ఫోన్‌ చేయగా.. నూకరాజు కుటుంబ సభ్యులను తాను కారులో రాజమహేంద్రవరం తీసుకెళ్లానని అక్కడకు వెళ్లాక.. మా తమ్ముడి ఇంటికి వెళుతున్నాం.. నువ్వు కారు వదిలేసి ట్రైన్‌ ఎక్కి ఇంటికి వెళ్లిపోమని డ్రైవర్‌కు చెప్పినట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. సోమవారం ఉదయానికి ఆయన కుటుంబంతో సహా ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు తెలిసి ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement