తిరుమలరావుకు పలువురి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

తిరుమలరావుకు పలువురి పరామర్శ

Aug 10 2026 12:16 AM | Updated on Aug 10 2026 12:16 AM

రాజమహేంద్రవరం రూరల్‌: తిరుమల విద్యాసంస్థల చైర్మన్‌ నున్న తిరుమలరావు, నున్న కృష్ణను పలువురు ప్రముఖులు ఆదివారం పరామర్శించారు. నున్న సురేష్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. కాతేరులోని తిరుమలరావు స్వగృహంలో నున్న సురేష్‌ పెద్దకార్యం సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన సోదరులు నున్న తిరుమలరావు, కృష్ణ, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన శ్రీనివాసరావు, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, బూరుగుపల్లి శేషారావు, వైఎస్సార్‌ సీపీ నేత జక్కంపూడి గణేష్‌, టీడీపీ, బీజేపీ నేతలు, ఇతర ప్రముఖులు ఉన్నారు.

ట్రాఫిక్‌ ఎస్సైపై వ్యక్తి దాడి

సామర్లకోట: స్థానిక స్టేషన్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ ఎస్సైపై ఆదివారం సాయంత్రం ఒక వ్యక్తి దాడి చేసిన సంఘటన ఇది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం బస్సు కాంప్లెక్స్‌, రైల్వే స్టేషన్‌ కూడలి ప్రదేశంలో ట్రాఫిక్‌ ఎస్సై అడపా గరగారావు విధులు నిర్వహిస్తున్నారు. జయలక్ష్మి థియేటర్‌ రోడ్డులో కల్వర్టు, విద్యుత్‌ ట్రాన్సుఫార్మర్‌ వద్ద ఒక వ్యక్తి మోటారు సైకిల్‌పై కూర్చుని ఉన్నాడు. వాహనాల రాకపోకల వల్ల మలుపులో ప్రమాదం జరిగే అవకాశం ఉందని గమనించిన ఎస్సై అతడిని దూరంగా వెళ్లాలని సూచించారు. దాంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఎస్సైపై దాడి చేయడంతో ఆయన కింద పడి పొయారు. వెంటనే స్థానికులు, ట్రాఫిక్‌ పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement