గండేపల్లి: జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో కారులో నలుగురు ప్రయాణికులకు తృటిలో భారీ ప్రమాదం తప్పింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు మండలంలోని మురారిలో అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తున్న కారు గ్రామంలో డివైడర్ వద్ద రోడ్డు దాటుతుండగా రాజమహేంద్రవరం నుంచి జగ్గంపేట వైపు వస్తున్న బొలెరో వ్యాన్ ఢీ కొట్టింది. ఈ సంఘటనతో కారు డివైడర్ గ్రిల్స్‌పైకి దూసుకుపోయి నిలిచింది. ప్రమాదస్థలం వద్దకు చేరుకున్న పోలీసులు, రోడు సేఫ్టీ వాహన సిబ్బంది కారును పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


